Diabetes : స్వీట్ తింటే షుగర్ పెరగడం కాదు..సరిగ్గా నిద్రపోకపోయినా కూడా డేంజరే..
Diabetes : రోజులు గడుస్తున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి, అది ప్రీ-డయాబెటిస్, ఆ తర్వాత పర్మినెంట్ టైప్-2 డయాబెటిస్‌గా మారిపోతుంది.
Diabetes
రాత్రి సమయంలో ఆకలి వేసి చిన్న స్వీట్ తిని అయ్యో నా షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ఉంటాయని టెన్షన్ పడుతుంటారు. కానీ అదే టైమ్‌లో ప్రశాంతంగా 8 గంటలు పడుకోకుండా అలా ఫోన్ స్క్రోల్ చేస్తూనే, ఇతర పనులు చేస్తూనో రోజూ ఐదారు గంటలే నిద్రపోతున్నారనే విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోరు.
ఇక్కడే మనమంతా పెద్ద పొరపాటు చేస్తున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ స్వీట్ తింటే బ్లడ్‌లో షుగర్ కాసేపు పెరిగి టాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్లీ డౌన్ అవుతుంది. కానీ ప్రతిరోజూ సరిపడా నిద్ర పోకపోతే మాత్రం ఇంటర్నల్ బాడీ సిస్టమ్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతుంది. నిద్రకీ, డయాబెటిస్(Diabetes)కు ఉన్న ఆ కనెక్షన్ ఏంటనేది నిపుణులు వివరిస్తున్నారు.
మన బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో నిద్ర ముఖ్యమైన రోల్ పోషిస్తుంది . మన బాడీకి సరిపడా నిద్ర లేనప్పుడు శరీరంలో ఇన్సులిన్ సరిగా వర్క్ చేయదు. కణాలు బ్లడ్‌లోని షుగర్‌ను ఎనర్జీగా మార్చుకోవడంలో ఫెయిలవుతాయి.
రోజులు గడుస్తున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి, అది ప్రీ-డయాబెటిస్, ఆ తర్వాత పర్మినెంట్ టైప్-2 డయాబెటిస్(Diabetes)గా మారిపోతుంది. దీనికి తోడు నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ చాలా ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ లివర్ నుంచి గ్లూకోజ్‌ను డైరెక్టుగా బ్లడ్లోకి నెట్టేయడమే కాకుండా ఇన్సులిన్ పనితీరును కూడా అడ్డుకుంటుంది.
దీనికితోడు నిద్ర తక్కువైనపుడు ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ల బ్యాలెన్స్ కూడా తప్పుతుంది. మర్నాడు ఉదయం లేవగానే జంక్ ఫుడ్, క్యాలరీలు, స్వీట్స్, బేకరీ ఫుడ్ వంటివి తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది. అలా తిని తిని వెయిట్ పెరగడం, ఆ వెనుకే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం ఒక సైకిల్లా మారిపోతుంది.

అప్పుడప్పుడు స్వీట్స్ తింటే షుగర్ లెవెల్స్ పెరగడం టెంపరరీ ప్రాబ్లెమ్ అవుతుంది . కానీ డైలీ నిద్ర సరిపోకపోతే మాత్రం ఇన్సులిన్, కార్టిసోల్, ఆకలి మూడు ఒకేసారి దెబ్బతింటాయి. దీని వల్ల లాంగ్ టర్మ్‌లో ఆరోగ్యం నిలువునా గుల్లవడం గ్యారంటీ.
అందుకే రోజూ రాత్రి 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. టైమ్‌తో పాటు నిద్ర క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. నిద్రలో తరచుగా మెలకువ రావడం, గురక పెట్టడం, ఉదయం లేవగానే తలనొప్పి లేదంటే రోజంతా నిద్రమత్తుగా ఉండటం వంటి స్లీప్ అప్నియా లక్షణాలుంటే మాత్రం వెంటనే స్పెషలిస్ట్‌ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి.





