HealthLatest News

Tea : గ్రీన్ టీ, బ్లాక్ టీతో బరువు తగ్గాలా?.. అయితే ఈ తప్పులు చేయకండి..

Tea : కొంతమంది బరువు తగ్గడానికి రోజుకు నాలుగైదు సార్లు గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగుతారు. ఇలా చేస్తే అస్సలు తగ్గలేరు పైగా లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tea

ఈ రోజుల్లో వెయిట్ తగ్గాలని అనుకునే ప్రతి ఒక్కరూ గ్రీన్ టీ లేదా బ్లాక్ టీని మస్ట్‌గా తాగుతున్నారు. కానీ వీటిని ఎలా తాగితే బరువు తగ్గుతారో చాలామందికి తెలీదు. కొంతమంది బరువు తగ్గడానికి రోజుకు నాలుగైదు సార్లు ఈ టీ(Tea) తాగుతారు. ఇలా చేస్తే అస్సలు తగ్గలేరు పైగా లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం నిద్ర లేవగానే చాలామంది పరగడుపున గ్రీన్ టీ(Tea) తాగుతుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదట. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల కొందరిలో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ తిన్న ఒక గంట తర్వాత లేదా సాయంత్రం పూట దీనిని తాగితే ఆరోగ్యానికి మంచిది.

ఒకవేళ మీరు వెయిట్ లాస్ కోసం ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ లేదా వర్కౌట్స్ చేస్తుంటే.. అవి స్టార్ట్ చేసే ఒక అరగంట ముందు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ(Tea) తాగితే బెటర్. వీటిలో ఉండే కెఫిన్ , ప్రత్యేక యాంటీఆక్సిడెంట్ల వల్ల బాడీ యాక్టివ్‌గా మారి, ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు ఒంట్లోని క్యాలరీలు ఖర్చయ్యి, ఫ్యాట్‌ చాలా వేగంగా కరుగుతుంది.

ఈ టీలను మరింత పవర్‌ఫుల్‌గా మార్చుకోవడానికి ..గ్రీన్ టీ, బ్లాక్ టీలో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే.. నిమ్మకాయలో ఉండే విటమిన్-సి వల్ల ఈ టీలోని మంచి గుణాలను మన బాడీ చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. పైగా టేస్ట్ కూడా బాగుంటుంది.

అయితే, రాత్రి పూట పడుకునే ముందు మాత్రం గ్రీన్ టీ, బ్లాక్ టీకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా బ్లాక్ టీలో కెఫిన్ పర్సంటేజ్ కాస్త ఎక్కువగా ఉండటం వల్ల, లేట్ నైట్ దీనిని తాగితే నిద్ర సరిగ్గా పట్టక నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

ఇక బరువు తగ్గించే విషయంలో గ్రీన్ టీకి, బ్లాక్ టీకి మధ్య పెద్దగా తేడా ఏం ఉండదు. కాకపోతే బాడీని క్లీన్ చేసే యాంటీఆక్సిడెంట్ల విషయంలో గ్రీన్ టీకి కొంచెం ఎక్కువ మార్కులు పడతాయని నిపుణులు అంటున్నారు.

Tea
Tea

అయితే ఈ రెండు టీల వల్ల పూర్తి ఫలితం దక్కాలంటే మాత్రం వాటిలో చక్కెర, పాలు, తేనె వంటివి అస్సలు కలపకూడదు. మనం రెగ్యులర్‌గా తాగే కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్‌ల ప్లేస్‌లో ఈ హెర్బల్ టీలను అలవాటు చేసుకుంటే బాడీలో అనవసరమైన క్యాలరీలు చేరకుండా ఉంటాయి.

మొత్తంగా కేవలం రోజుకు రెండు కప్పుల టీ తాగినంత మాత్రాన బరువు తగ్గిపోరన్న విషయాన్ని తెలుసుకోవాలి. దాంతో పాటు తినే తిండిలో కంట్రోల్ ఉండాలి. అలాగే రోజువారీ లైఫ్‌స్టైల్‌లో వ్యాయామాన్ని కూడా యాడ్ చేయాలి. మంచి డైట్ మెయింటైన్ చేస్తూ, ఈ టీలను ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడు మాత్రమే వెయిట్‌ తగ్గడంతో పాటు ఇతర బెనిఫిట్స్ పొందుతారు.

Negative Energy : నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి?.. దిష్టి తీయడం వెనుక ఉన్న రహస్యం తెలుసా?

Related Articles

Back to top button