Holly : డయాలసిస్ నరకానికి ఎండ్ కార్డ్.. కృత్రిమ కిడ్నీ హోల్లీ వచ్చేస్తుంది..
Holly : మన బాడీలో ఉన్న కిడ్నీలు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా 24/7 రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను బయటకు పంపిస్తూనే ఉంటాయి.
Holly
డయాలసిస్ చేయించుకునే కిడ్నీ బాధితుల లైఫ్ పెద్ద నరకంతో సమానం. వారానికి 2 లేదా 3 సార్లు హాస్పిటల్‌కు వెళ్లడం,పదునైన సూదుల నొప్పిని భరించడం, గంటల తరబడి బెడ్‌పై పడుకుని నరకయాతన పడటం తలుచుకుంటేనే వణికిపోతుంటారు.
ఒకవైపు కష్టపడి సంపాదించిన సొమ్మంతా హాస్పిటల్ బిల్లులు కట్టడానికే సరిపోతుంటే, మరోవైపు పనులు చేసుకోవడానికి, జర్నీలు చేయడానికి కూడా బాడీ సహకరించక నలిగిపోయే బాధితులకు ఇప్పుడు ఒక అద్భుతమైన సైంటిఫిక్ సొల్యూషన్ ఆశాకిరణంలా కనిపిస్తోంది.
డయాలసిస్ సెంటర్ల చుట్టూ తిరిగే దయనీయ పరిస్థితికి పర్మినెంట్‌గా చెక్ పెట్టే దిశగా హోల్లీ (Holly) అనే ఒక విప్లవాత్మక ఆర్టిఫిషియల్ కిడ్నీ రూపుదిద్దుకుంటోంది. ఈ డివైజ్‌ను డైరెక్టుగా మనిషి బాడీలోనే అమర్చేలా సైంటిస్టులు డిజైన్ చేస్తుండటం విశేషం.
నిజానికి మన బాడీలో ఉన్న కిడ్నీలు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా 24/7 రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను బయటకు పంపిస్తూనే ఉంటాయి. కానీ డయాలసిస్ మిషన్ ద్వారా ఈ వర్క్ వారానికి కొన్ని గంటలు మాత్రమే జరుగుతుంది. అందుకే ఈ తేడాని భర్తీ చేయడానికి హోల్లీని కూడా నేచురల్ కిడ్నీలాగే కంటిన్యూగా పనిచేసేలా డెవలప్ చేస్తున్నారు.
పొత్తికడుపు లేదా పెల్విస్ ప్రాంతంలోని ఒక చిన్న సర్జరీ ద్వారా దీన్ని రక్తనాళాలకు కనెక్ట్ చేస్తారు. ఇది లోపల ఉంటూనే బ్లడ్‌ను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి, వ్యర్థాలను, ఎక్స్ట్రా ఉన్న నీటిని బయటకు పంపేస్తుంది. ఈ డివైజ్ కనుక క్లిక్ అయితే కిడ్నీ బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరిగే పనే ఉండదు. హాయిగా పనులు చేసుకోవచ్చు, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు, రోజువారీ లైఫ్‌ను అందరిలాగే లీడ్ చేయొచ్చు.
ఇండియాలో విపరీతంగా పెరిగిపోతున్న డయాబెటిస్, బీపీ సమస్యలే కిడ్నీలు పాడవ్వడానికి ముఖ్య కారణాలుగా మారుతున్నాయి. దీనికి తోడు సరైన ఆహార నియమాలు లేకపోవడం, శరీరానికి తగినంత వాటర్ అందించకపోవడం, డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల చాలామందికి చిన్నవయసులోనే కిడ్నీలు దెబ్బతింటున్నాయి.
అయితే కిడ్నీలు సుమారు 70 నుంచి 80 శాతం పాడయ్యే వరకు బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది దీని బారిన పడుతున్నారు. దీంతో చివరి నిమిషంలో డయాలసిస్ , కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకూ వెళ్లాల్సి వస్తోంది.

హోల్లీ(Holly) పరికరం వర్కవుట్ అయితే మాత్రం ఒక పెద్ద మెడికల్ రివల్యూషన్ రావడం ఖాయమని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ డెవలప్మెంట్ ఇంకా స్టార్టంగ్ స్టేజ్‌లోనే ఉంది. మనుషులపై చేసే క్లినికల్ ట్రయల్స్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. ఈ డివైజ్ బాడీలో ఎంతవరకు సురక్షితం, ఇన్ఫెక్షన్లు రాకుండా ఎంత సమర్థంగా పనిచేస్తుందనేది ఈ పరీక్షల్లో తేలాల్సి ఉంది.
భారతదేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాల్లో ఇండియా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కొచ్చి, బెంగళూరు, ముంబయి సిటీల్లో ఈ హోల్లీ పరికర తయారీతో పాటు, పరిశోధనలు కూడా వేగంగా జరుగుతున్నాయి.
Sravana Masam Prasadam : శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ ప్రసాదం చేసి పెట్టండి..లక్ష్మీదేవి కటాక్షం ఖాయం





