HealthJust LifestyleLatest News

Olive Oil: ఆలివ్ నూనెతో మీ పొట్టకు ఎంత మేలో తెలుసా?

Olive Oil:రోజూ ఒక చెంచా ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల పేగులు చాలా ఆరోగ్యంగా ఉంటాయట. దీనిలో ఉండే మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Olive Oil

మన ఆరోగ్యమంతా మన జీర్ణక్రియపైనే ఆధారపడి ఉంటుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మనం తిన్న ఆహారమంతా సరిగ్గా అరిగి, మన ఒంటికి పట్టాలంటే పొట్ట లోపల వ్యవస్థ బాగుండాలని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు.

అయితే పొట్ట ఆరోగ్యం కోసం ఆలివ్ నూనె(Olive Oil )ఒక అద్భుతమైన మందులా పనిచేస్తుందన్న విషయం మాత్రం చాలామందికి తెలీదు. రోజూ ఒక చెంచా ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల పేగులు చాలా ఆరోగ్యంగా ఉంటాయట. దీనిలో ఉండే మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే మనం ఏదైనా తిన్నప్పుడు అది త్వరగా అరగడానికి, దానిలో ఉండే పోషకాలను మన శరీరం పీల్చుకోవడానికి ఆలివ్ నూనె(Olive Oil )బాగా సాయపడుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు.

అలాంటి వారు రోజూ కొంచెం ఆలివ్ నూనె(Olive Oil )తీసుకుంటే, అది పొట్ట లోపల ఒక జిడ్డు పదార్థంలా పనిచేసి విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీనివల్ల కడుపులో గట్టిగా ఉన్న వ్యర్థాలు ఈజీగా బయటకు వెళ్లిపోతాయి.

Olive Oil
Olive Oil

ఆలివ్ నూనెలో ఉండే ఒలేయిక్ యాసిడ్ అనే ఒక రకమైన ఫ్యాట్, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ ఉంటే, మన రెసిస్టెన్స్ పవర్ అంత బాగుంటుంది. అయితే ఆలివ్ నూనెను వాడేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రోజూ ఒక చెంచా డైరెక్టుగా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే కొందరికి కడుపుబ్బరం , విరేచనాలు వంటివి అయ్యే అవకాశం ఉంది.

అయితే బీపీ మందులు వాడే వారికి, చిన్న పిల్లలకు ఆలివ్ ఆయిల్‌ను ఇచ్చే ముందు డాక్టరును అడగాలి. కేవలం పొట్టకే కాకుండా, గుండె జబ్బులు రాకుండా చూడటంలో, మెదడు చురుగ్గా పని చేయడంలోనూ ఆలివ్ నూనె తోడ్పడుతుంది. ముఖ్యంగా మతిమరుపు రాకుండా కాపాడుతుంది. షుగర్ ఉన్నవారికి కూడా ఆలివ్ ఆయిల్ చాలా మంచిది.

Paneer :విస్తరిస్తున్న కల్తీ పన్నీర్ మాఫియా.. దీనిని ఎలా గుర్తించాలి?

Related Articles

Back to top button