Fruits:షుగర్ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలట..
Fruits: ఫలరాజుగా పిలిచే మామిడిపండు అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ దీనిలో నేచురల్ షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
Fruits
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని..విటమిన్లు , ఖనిజాలను అందిస్తాయని . అయితే, డయాబెటిస్ ఉన్నవారికి అన్ని పండ్లు(Fruits) మిత్రులు కావు. కొన్ని రకాల పండ్లలో ఉండే ఎక్కువ షుగర్ పర్సంటేజ్ వల్ల బ్లడ్‌లోని గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదముంది. మరి షుగర్ ఉన్నవారు ఏయే పండ్లను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలో డాక్టర్లు చెబుతున్నారు.
మామిడి పండ్లు (Mangoes)..ఫలరాజుగా పిలిచే మామిడిపండు అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ దీనిలో నేచురల్ షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక సాధారణ సైజు మామిడి పండులో సుమారు 45 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇది బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ను స్పీడ్‌గా పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు దీనికి దూరంగా ఉండటం లేదా చాలా తక్కువగా తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

పైనాపిల్ (Pineapple).. పైనాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉన్నా కూడా, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. అంటే ఇది తిన్న వెంటనే బాడీలోకి షుగర్ చేరుతుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో దాదాపు 16 గ్రాముల షుగర్ ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఈ పండు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

అరటి పండ్లు (Bananas).. తక్షణ శక్తిని ఇచ్చేఈ అరటి పండ్లలో ‘గ్లైసెమిక్ ఇండెక్స్’ (GI) ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని తిన్న తర్వాత బ్లడ్‌లో షుగర్ చాలా వేగంగా రిలీజవుతుంది. ఒక అరటి పండులో సుమారు 14 గ్రాముల చక్కెర ఉంటుంది. మరీ ముఖ్యంగా బాగా పండిన అరటి పండ్లను షుగర్ ఉన్నవారు తినకపోవడమే ఉత్తమం.

ద్రాక్ష (Grapes)..ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నా సరే, ఇందులో ఫ్రక్టోజ్ శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ద్రాక్ష తింటే బాడీలోకి సుమారు 23 గ్రాముల షుగర్ చేరుతుంది. ఇది షుగర్ పేషెంట్లకు అంత మంచిది కాదు. వీటిని తిన్న వెంటనే గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులు వచ్చే అవకాశముంది.

చెర్రీస్ (Cherries).. చిన్నగా, ఎర్రగా కనిపించే చెర్రీలు ఎంతో తీపిని కలిగి ఉంటాయి. ఒక కప్పు చెర్రీలలో దాదాపు 18 గ్రాముల వరకు షుగర్ ఉంటుంది. వీటిని మోతాదు మించి తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ తప్పే ప్రమాదముంది. క్వాంటిటీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లిచీ , అంజీర (Lychee & Figs)..లిచీ పండ్లలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ. ఒక కప్పు లిచీ పండ్లలో సుమారు 29 గ్రాముల చక్కెర ఉంటుంది. అలాగే అంజీర (అత్తి పండ్లు) కూడా చాలా స్వీటుగా ఉంటాయి. కేవలం రెండు అంజీర పండ్లు తిన్నా 16 గ్రాముల షుగర్ శరీరంలోకి చేరుతుంది. ముఖ్యంగా డ్రై అంజీరలో షుగర్ క్వాంటిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది.

పండ్లు తినడం మంచిదే అయినా, డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న జామ, ఆపిల్ (తొక్కతో సహా), బొప్పాయి వంటి పండ్లను ఎంచుకోవడమే మంచిది.





