HealthJust LifestyleLatest News

Nostalgia:మధుర జ్ఞాపకాల ఓదార్పు కావాలా? అసలు ది పవర్ ఆఫ్ నోస్టాల్జియా గురించి తెలుసా ?

Nostalgia : ఏదైనా పాత వస్తువులు చూసినా లేదా పాత స్నేహితుడు కనిపించినా మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజవుతుంది.

Nostalgia

జీవితం చాలా వేగంగా పరిగెడుతోంది. ప్రతిరోజూ ఏదోక ఒత్తిడి, కొత్త సవాళ్లు మనందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా రేడియోలోనో, టీవీలోనో ఒక పాత పాట వినిపించినా, లేదంటే అల్మారాలో దాచుకున్న పాత ఫోటోలు కనిపించినా మనసు ఒక్కసారిగా జ్ఞాపకాలలోకి వెళ్లిపోతుంది.

కళ్లముందు ఉన్న కష్టాలన్నీ కూడా ఆ క్షణంలో మాయమైపోయి, చిన్నప్పుడు వర్షంలో ఆడిన ఆటలతో పాటు..అమ్మ చేసిన వేడి వేడి వంటలు, నాన్నతో కలిసి వెళ్లిన ప్రయాణాలు అన్నీ వన్ బై వన్ గుర్తొస్తాయి. ఆ సమయంలో మన ముఖంలో మనకు తెలీకుండానే ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. దీనినే సైకాలజీలో నోస్టాల్జియా(Nostalgia) అంటారు. అంటే గతంపై ఉండే మక్కువ అని అర్ధం.

ఒకప్పుడు నోస్టాల్జియాను ఒక మానసిక వ్యాధిగా భావించేవారు. అలా పాత జ్ఞాపకాలలోకి వెళ్లి మనిషి గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడని అనేవారు. కానీ సైకాలజీ ప్రకారం, నోస్టాల్జియా(Nostalgia) అనేది వ్యాధి కాదని మన మెదడు మనకు ఇచ్చే ఒక అద్భుతమైన మందు అని తేలింది.

మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఏదైనా విపత్తులో ఉన్నప్పుడు,ఆ గతం మనల్ని ఓదార్చుతుంది. నేను ఒకప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను, నాకు ఇంతమంది ఆత్మీయులు ఉండేవారనే ఆలోచన. మనలో మళ్లీ ఆనందంగ బతకాలనే ఆశను, ధైర్యాన్ని నింపుతుంది. గతం అనేది ఒక పునాది వంటిది, అందుకే అది మనల్ని వర్తమానంలో నిలబెడుతుంది.

మన మెదడులోని హిప్పోక్యాంపస్ అనే భాగం ఈ జ్ఞాపకాలన్నిటిని భద్రపరుస్తుంది. ఏదైనా పాత వస్తువులు చూసినా లేదా పాత స్నేహితుడు కనిపించినా మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజవుతుంది. అందుకే ఆనాటి పాత పాటలు విన్నప్పుడు కలిగే ఆనందం కొత్త వాటిలో దొరకదు. ఇంకా చెప్పాలంటే నోస్టాల్జియా అనేది మనకు మన మూలాలను గుర్తు చేస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన అస్తిత్వం ఏంటో తెలియజేస్తుంది. ప్రస్తుత బిజిబిజీ ఆర్టిఫిషియల్ జీవితంలో మనిషి తనని తాను కోల్పోతున్నప్పుడు, గతం ఒక దిక్సూచిలా మారి తమను తాము మరోసారి పరిచయం చేస్తుంది.

Nostalgia 
Nostalgia

ముఖ్యంగా పండుగలు, పాత సినిమాలు, ఊరు వెళ్లడం వంటి విషయాల్లో ఈ నోస్టాల్జియా అనేది చాలా బలంగా పనిచేస్తుంది. అంతెందుకు ఈ రీజన్ తోనే కంపెనీలు కూడా తమ మార్కెటింగ్ కోసం పాత కాలపు జ్ఞాపకాలను వాడుకుంటున్నాయి. మీ చిన్ననాటి రుచి అంటూ యాడ్స్ ఇవ్వడం వెనుకున్న సైకాలజీ కూడా ఇదే. మనలో చాలామంది భవిష్యత్తు గురించి ఆందోళన పడతారు. కానీ గతం గురించి మాత్రం చాలా క్లారిటీగా ఉంటారు. ఎందుకంటే గతం ముగిసిపోయిన కథ, అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఆ స్థిరత్వం మనకు ఒక రకమైన మానసిక భద్రతనిస్తుంది.

అయితే, ఇది మంచిది కదా అని గతంలోనే ఉండిపోయి వర్తమానాన్ని మర్చిపోవడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. నోస్టాల్జియా(Nostalgia ) అనేది అలసిపోయినప్పుడు తీసుకునే విశ్రాంతి అవ్వాలి తప్ప, అదే ఒక శాశ్వత నివాసం కాకూడదు. మొత్తంగా నోస్టాల్జియా అనేది మన మనసుకి కలిగే ఒక అందమైన ఆత్మీయ స్పర్శ అని తెలుసుకోవాలి. అది మనల్ని మన బాల్యంలోకి, మన ఆత్మీయుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఎంత ఎదిగినా, ఎన్ని సాధించినా మన లోపల ఉండే ఆ పాత జ్ఞాపకాలే మనల్ని అసలైన మనిషిగా ఉంచుతాయి. ఆ మధురమైన జ్ఞాపకాలను ఒక జ్ఞాపికగా దాచుకుంటూ, నేటి జీవితాన్ని ఉత్సాహంగా గడపడమే నిజమైన జీవన సూత్రం.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button