HealthJust LifestyleLatest News

Prawns : రొయ్యలు బాగా ఇష్టమా? అయితే తినేముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Prawns : సీఫుడ్ పేరు చెప్పగానే చేపలు, పీతలు కంటే ఎక్కువ మంది ఓటేసేవి రొయ్యలకే . వీటిలో ఉండే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటినే చాలామంది ఇష్టపడతారు

Prawns

సీఫుడ్ పేరు చెప్పగానే చేపలు, పీతలు కంటే ఎక్కువ మంది ఓటేసేవి రొయ్యలకే. వీటిలో ఉండే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటినే చాలామంది ఇష్టపడతారు. ఇది నిజమే అయినా, అందరికీ ఇవి అమృతం కావంటున్నారు వైద్యులు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు రొయ్యలను ఆహారంగా తీసుకుంటే అవి ప్రాణాంతక సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా కీళ్ల నొప్పులు లేదా గౌట్ సమస్య ఉన్నవారు రొయ్యలకు దూరంగా ఉండాలి. రొయ్యల్లో ప్యూరిన్లు అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో జీర్ణమైనప్పుడు యూరిక్ యాసిడ్‌గా మారుతాయి. ఈ యాసిడ్ శాతం రక్తంలో పెరిగితే అది కీళ్ల మధ్యలో పేరుకుపోయి.. విపరీతమైన నొప్పిని, వాపును కలిగిస్తుంది. రొయ్యలు తిన్న మర్నాటి నుంచి చాలా మందిలో కీళ్ల నొప్పులు ఎక్కువవ్వడానికి ఇదే మెయిన్ రీజన్.

అలాగే మూత్రపిండాల సమస్యలున్నవారు కూడా రొయ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రాన్స్‌లో సోడియం , పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. బలహీనమైన కిడ్నీలు ఈ ఖనిజాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడంతో.. దీనివల్ల కిడ్నీలపై అదనపు భారం పడుతుంది.

Prawns
Prawns

థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా సీ ఫుడ్ ముఖ్యంగా రొయ్యలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనిలో ఉండే సహజ అయోడిన్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. రొయ్యల వల్ల అలెర్జీలు రావడం కూడా మరో పెద్ద సమస్యగా ఉంటుంది. ఇవి తిన్న వెంటనే చాలామందికి చర్మంపై దద్దుర్లు రావడం, దురద, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంటాయి.

Prawns
Prawns

గుండె సంబంధిత వ్యాధులున్నవారికి రొయ్యల్లో ఎక్కువ మోతాదులో ఉండే కొలెస్ట్రాల్ చాలా హాని కలిగిస్తుంది. అలాగే రొయ్యలను వండే ముందు వాటి వెనుక భాగంలో ఉండే నల్లటి నరాన్ని తొలగించడం చాలా ముఖ్యమన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అది రొయ్య యొక్క విసర్జక పదార్థం కాబట్టి.. దాన్ని శుభ్రం చేయకుండా తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. చాలా హోటల్స్‌లో ఇది తీయకుండానే వండుతారు కాబట్టి బయట రొయ్యలతో చేసిన రెసిపీలు తినకుండా ఉండటమే బెటర్.

SRH : దంచికొట్టిన సన్ రైజర్స్ బ్యాటర్లు..244 టార్గెట్ ను ఊదేసిన హైదరాబాద్

Related Articles

Back to top button