Geometric Floral Silver Gold : సాంప్రదాయానికి ట్రెండీ టచ్.. జియోమెట్రిక్ ఫ్లోరల్ సిల్వర్ గోల్డ్‌తో క్లాసీ లుక్..
Geometric Floral Silver Gold : ట్రెడిషనల్ పూల ఆకారాలకు మోడరన్ జియోమెట్రిక్ కట్స్ యాడ్ అవ్వడంతో ఇవి వెస్ట్రన్ డ్రెస్‌లు, ఆఫీస్ వేర్, జీన్స్ మాత్రమే కాకుండా చీరలకు కూడా సూపర్ స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి.
Geometric Floral Silver Gold
ఒకప్పుడు గోల్డ్ అంటే కేవలం తాతల కాలం నాటి హెవీ ట్రెడిషనల్ డిజైన్లు, ఫ్లవర్ పాటర్న్‌లు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ కొన్నాళ్లుగా ట్రెండ్ మారింది. ఇక ఈ తరం ఫ్యాషన్ లవర్స్ అయితే హెవీ జ్యువెలరీ కంటే కూడా ట్రెండీగా, క్లాసీగా ఉండే డిజైన్ల వైపు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
అలా సరికొత్త ఫ్యాషన్ వేవ్ జియోమెట్రిక్ ఫ్లోరల్ సిల్వర్ గోల్డ్ (Geometric Floral Silver Gold) జ్యువెలరీ మార్కెట్‌ను ఊపేస్తుంది. చూడగానే ఆకట్టుకునే డిజైన్, పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్, ఏ డ్రెస్‌కైనా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే లుక్.. ఇవే ఇప్పుడు అమ్మాయిలను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి.
అసలు జియోమెట్రిక్ ఫ్లోరల్ సిల్వర్ గోల్డ్(Geometric Floral Silver Gold) అంటే .. ప్రకృతి సిద్ధమైన పూలు, ఆకుల ఆకారాలకు (Floral)..సైన్స్ అండ్ మ్యాథ్స్‌లో ఉండే త్రిభుజాలు, చతురస్రాలు, సర్కిల్స్ వంటి పదునైన రేఖాగణిత ఆకారాలను (Geometric) మిక్స్ చేసి క్రియేట్ చేసే ఆర్ట్ ఇది. అంటే పూల మృదుత్వానికి, మోడరన్ షేప్స్ గ్రేస్‌ను యాడ్ చేస్తారన్నమాట.
ఇక దీనిలో వాడే మెటీరియల్ విషయానికి వస్తే.. బేస్ మొత్తం ప్యూర్ సిల్వర్(Silver)తో తయారు చేసి, దానిపై 18కె లేదా 22కె క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్లేటింగ్ (Gold Plating/Vermeil) వేస్తారు. దీనివల్ల చూడటానికి అచ్చం ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ లాగే కనిపిస్తుంది కానీ కాస్ట్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
యూనిక్ అండ్ క్లాసీ లుక్ వల్ల ఫ్యాషన్ మార్కెట్‌లో ఈ జ్యువెలరీకి రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. ట్రెడిషనల్ పూల ఆకారాలకు మోడరన్ జియోమెట్రిక్ కట్స్ యాడ్ అవ్వడంతో ఇవి వెస్ట్రన్ డ్రెస్‌లు, ఆఫీస్ వేర్, జీన్స్ మాత్రమే కాకుండా చీరలకు కూడా సూపర్ స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి.

అలాగే ఇవి హెవీ జ్యువెలరీలా కాకుండా రోజంతా వేసుకున్నా చాలా కంఫర్టబుల్‌గా, తేలికగా ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ గోల్డ్ లుక్ వల్ల దీని డిమాండ్ అండ్ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోతుంది. గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మోడరన్ డిజైన్లు కొనాలంటే లక్షలు ఖర్చు చేయాలి. కానీ సిల్వర్ బేస్‌పై గోల్డ్ కోటింగ్ రావడం వల్ల చాలా తక్కువ కాస్ట్‌లోనే కంటికి గోల్డ్‌లా మెరిసే గ్రాండ్ లుక్ సొంతమవుతుంది.
కాలేజ్ అమ్మాయిలు, ఆఫీస్‌కు వెళ్లే వర్కింగ్ ఉమెన్ నుంచి ట్రెండీ లేడీస్ వరకు ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఈ జియోమెట్రిక్ ఫ్లోరల్ సిల్వర్ గోల్డ్(Geometric Floral Silver Gold)కే ఓటేస్తున్నారు. ఇయర్ రింగ్స్, చిన్న చిన్న పెండెంట్లు, స్లిమ్ గాజులు, రింగ్స్‌లో ఈ డిజైన్లు మార్కెట్‌లో ఓ రేంజ్‌లో సేల్ అవుతున్నాయి. మీ జ్యువెలరీ కలెక్షన్‌లో కూడా ఒక ట్రెండీ పీస్ ఉండాలని అనుకుంటే మాత్రం దీనిపై ఒక లుక్కేయండి.
Relationship Secrets : ప్రేమ ఉంటే సరిపోదా? గోల్స్ డిఫరెంట్‌గా ఉంటే రిలేషన్‌షిప్ సక్సెస్ అవడం కష్టమా?





