Health Insurance : కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా.. వ్యక్తిగత బీమా అవసరమా?
Health Insurance : ఆఫీస్ నుంచి వచ్చే పాలసీ ఉంది కదా అని పర్సనల్‌గా ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. కానీ ఎమర్జెన్సీ సమయాల్లో కేవలం కార్పొరేట్ ఇన్సూరెన్స్ పైన మాత్రమే ఆధారపడటం కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Health Insurance
ఇప్పుడున్న కార్పొరేట్ ఉద్యోగాలలో హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) అనేది కామన్ బెనిఫిట్‌గా మారిపోయింది. కంపెనీలన్నీ కూడా తమ ఉద్యోగులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మెడికల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. అయితే చాలామంది ఆఫీస్ నుంచి వచ్చే పాలసీ ఉంది కదా అని పర్సనల్‌గా ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. కానీ ఎమర్జెన్సీ సమయాల్లో కేవలం కార్పొరేట్ ఇన్సూరెన్స్ పైన మాత్రమే ఆధారపడటం కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక కంపెనీ తమ ఎంప్లాయిస్ కోసం గ్రూప్ ప్లాన్ రూపంలో తీసుకుంటుంది. ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు రక్షణగా ఉంటుంది. అదే ఒకవేళ మీరు జాబ్ మారిపోయినా లేదా రిటైర్ అయినా ఆ పాలసీ అసలు వర్తించదు.
అదే పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) అయితే డైరెక్టుగా మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తాం. ప్రతి సంవత్సరం టైమ్‌కి ప్రీమియం చెల్లిస్తే చాలు, ఉద్యోగంతో సంబంధం లేకుండా లైఫ్ లాంగ్ మనకు మెడికల్ సేఫ్టీ ఉంటుంది.
కవరేజ్ , బెనిఫిట్స్ విషయానికి వస్తే కార్పొరేట్ పాలసీలో లిమిట్స్‌ని మీ కంపెనీ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న మెడికల్ ఖర్చులకు ఆ మొత్తం సరిపోకపోవొచ్చు. అదే పర్సనల్ పాలసీలో అయితే మన ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టు, మన బడ్జెట్‌కు తగినట్టు ఎంతైనా కవరేజ్ అమౌంట్‌ను పెంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు క్రిటికల్ ఇల్నెస్, నో క్లెయిమ్ బోనస్ వంటి అదనపు ఫీచర్లను మనమే సెలెక్ట్ చేసుకుని ఆ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

అయితే కార్పొరేట్ పాలసీలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ మాత్రం ఉంది. సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్‌లలో మొదటి రోజు నుంచే ముందస్తు వ్యాధులకు అంటే ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవరేజ్ లభిస్తుంది. అదే పర్సనల్ పాలసీలలో అయితే పాత రోగాలకు కవరేజ్ రావడానికి కొంత కాలం పాటు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది.
మొత్తంగా ఆఫీస్ ఇచ్చే కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఎమర్జెన్సీ వేళల్లో మంచి సపోర్ట్ ఇస్తుంది. కానీ అది ఎప్పటికీ పర్మినెంట్ కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూ హెల్త్ ప్రొటెక్షన్, ఎక్కువ కవరేజ్ , ఫ్యూచర్ సెక్యూరిటీ కావాలనుకునే వారు మాత్రం కంపెనీ పాలసీతో పాటు ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండిటిని కూడా కలిగి ఉండటం చాలా మంచి నిర్ణయం. దీనివల్ల ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఫైనాన్సియల్‌గా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు.
Enumeration : ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్కు 6 రోజులే గడువు.. ఆలస్యం చేస్తే మీ ఓటు గల్లంతే





