Just SpiritualLatest News

Tholi Ekadashi : తొలి ఏకాదశి నుంచి ఆ 2 రాశుల వారికి తిరుగులేదు..జూలై 25 తర్వాత మీ జీవితం మారబోతోంది..

Tholi Ekadashi : తొలి ఏకాదశి నుంచి ముఖ్యంగా 3 ప్రధాన గ్రహాల అనుకూల గమనం వల్ల 2 రాశుల వారికి తిరుగులేని రాజయోగం పట్టబోతోందని, వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు రాబోతున్నాయని పండితులు చెబుతున్నారు.

Tholi Ekadashi

ఈ జూలై 25న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొలి ఏకాదశి రాబోతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం చూస్తే పండుగల సీజన్ ఈరోజు నుంచే మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం చూస్తే.. ఈ మాసంలో జరిగే ముఖ్యమైన గ్రహాల సంచారం , వాటి స్థాన మార్పులు కొన్ని రాశుల జాతకాలను పూర్తిగా మార్చేయబోతున్నాయి.

ముఖ్యంగా 3 ప్రధాన గ్రహాల అనుకూల గమనం వల్ల 2 రాశుల వారికి తిరుగులేని రాజయోగం పట్టబోతోందని, వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు రాబోతున్నాయని పండితులు చెబుతున్నారు.

తొలి ఏకాదశి(Tholi Ekadashi) పర్వదినం నుంచి మకర రాశి వారికి అదృష్టం వరించబోతోంది. వీరు ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం లభిస్తుంది. ఎంతోకాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కల ఇప్పుడు నెరవేరుతుంది. కొత్తగా బిజినెస్ ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది గోల్డెన్ టైమ్ అనే చెప్పొచ్చు.

కోర్టు వివాదాలతో పాటు, పాత సమస్యల నుంచి వీరికి పూర్తిగా విముక్తి లభిస్తుంది. సొసైటీలోనే కాకుండా ఇంట్లో కూడా మీ మాటకు వ్యాల్యూ పెరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు అద్భుతంగా మారడం వల్ల సొంత ఇల్లు, కొత్త వాహనం వంటివి కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువ.

Tholi Ekadashi
Tholi Ekadashi

ధనస్సు రాశి వారికి ఈ గ్రహాల మార్పు వల్ల మంచి కాలం ప్రారంభం కాబోతుంది . కొంతకాలంగా వీరిని వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇక మీదట పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, వ్యాపారస్తులకు ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి.

గతంలో నిలిచిపోయిన ,మధ్యలో వదిలేసిన పనులు ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాల పరంగా కూడా ధనస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది, అయితే ప్రయాణ సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. మీకు ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది.

Brown Rice : బ్రౌన్ రైస్ తింటూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే..

Related Articles

Back to top button