Alibaba : పెంటగాన్‌పై కోర్టుకు అలీబాబా.. ఆ రెండు దేశాల టెక్ వార్‌కు బలయ్యారా?
Alibaba : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ ఇస్తున్న వారి జాబితా నుంచి తమ గ్రూప్ పేరు తొలగించాలంటూ అలీబాబా పిటిషన్ దాఖలు చేశారు.
Alibaba
అమెరికా, చైనాల మధ్య పైకి సంబంధాలు బాగానే ఉన్నట్టు కనిపించినా తెరవెనుక మాత్రం వేరే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య టెక్ వార్ తారాస్థాయికి చేరింది. ఈ రంగంలో ఆధిపత్యం కోసం రెండు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక దేశంపై మరొకటి ఆంక్షలు విధించుకుంటున్నాయి.
ఇటీవలే చైనా సైన్యానికి మద్దతుగా ఉన్నారంటూ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ ను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది. ప్రస్తుతం ఈ వివాదంపై అలీబాబా(Alibaba) కోర్టుకెళ్లారు. అమెరికా రక్షణ శాఖ కేంద్రం పెంటగాన్‌పై కోర్టులో కేసు వేసారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ ఇస్తున్న వారి జాబితా నుంచి అలీబాబా గ్రూప్ పేరు తొలగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
పెంటగాన్ ఎటువంటి ఆధారాలు లేకుండా తమను చైనా సైన్యానికి మద్దతుదారులుగా పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని తప్పుపడుతూ అలీబాబా(Alibaba) గ్రూప్ పెంటగాన్ పై కాలిఫోర్నియా శాన్‌జోస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నెల ఆరంభంలో అమెరికా రక్షణ శాఖ పలు చైనా సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి మద్దతు ఇస్తున్నారంటూ ఈ చర్యలు తీసుకుంది. దీనిలో అలీబాబా(Alibaba) గ్రూప్, బైడూ, చాంగ్‌క్సిన్ మెమరీ టెక్నాలజీస్, బీవైడీ , యూనిట్రీ రోబోటిక్స్ వంటి ప్రముఖ కంపెనీలున్నాయి.
అయితే తమకు చైనా సైన్యంతో సంబంధం లేదని అలీబాబా గ్రూప్ పెంటగాన్ కు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కీలక పత్రాలతో కూడిన వివరణలు అందజేసింది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత పెంటగాన్ నుంచి స్పందన రాలేదు. అదే సమయంలో జూన్ మొదటి వారంలో విడుదల చేసిన బ్లాక్ లిస్ట్ కంపెనీల జాబితాలో తమ పేరు ఉండడంతో అలీబాబా గ్రూప్ షాక్ కు గురైంది.

తాము స్పష్టమైన వివరణలు సమర్పించినా ఇలా చర్యలు తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పెంటగాన్ పై కేసు వేసింది. గతంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న పలు చైనా కంపెనీలు పెంటగాన్ పై న్యాయపోరాటం చేసి గెలవడం ద్వారా తమ పేర్లను బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి తొలగించుకున్నాయి. ఇప్పుడు అలీబాబా గ్రూప్ కూడా అదే బాటలో ఉంది. బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉంటే అమెరికా సైన్యంతో ఒప్పందాలు, ఇతర నిధులు పొందే అవకాశం ఉండదు.
Minister Anam : సాయిబాబా ఆలయాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన మంత్రి ఆనం.. బాబా భక్తులకు క్షమాపణలు





