War:యుద్ధం 16వ రోజు.. చైనా, ఫ్రాన్స్, జపాన్ దేశాల సాయం కోరిన ట్రంప్
War: పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు (War)చల్లారడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య పోరు 16వ రోజుకు చేరుకోవడంతో పరిస్థితి చాలా భయంకరంగా మారింది
War
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు (War)చల్లారడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య పోరు 16వ రోజుకు చేరుకోవడంతో పరిస్థితి చాలా భయంకరంగా మారింది. ముందుగా సైనిక స్థావరాలకు మాత్రమే పరిమితమైన ఈ దాడులు, ఇప్పుడు ఆర్థిక మూలాలపైకి కూడా మళ్లడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
ముఖ్యంగా ఇరాన్ చమురు నిల్వలే టార్గెట్‌గా ఈ దాడులన్నీ జరుగుతుండటంతో..ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో చమురు ధరల సెగ తగిలేలా కనిపిస్తోంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై చాలా సీరియస్‌గా రియాక్టవుతున్నారు. ఇరాన్‌కు చమురు సంపదకు ఆయువుపట్టు వంటి ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని ఇప్పటికే 100 శాతం నిర్వీర్యం చేసినట్లు ప్రకటించిన ట్రంప్, బాంబుల వర్షం ఆపేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
అంతేకాదు హర్మూజ్ జలసంధిని రక్షించడానికి చైనా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలకు కూడా తమ యుద్ధనౌకలను పంపమంటూ..ట్రంప్ తాజాగా పిలుపునివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హర్మూజ్‌కు త్వరలోనే స్వేచ్ఛ కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇచ్చారు.
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి.. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గల్ఫ్ దేశాలను రక్షించడంలో అమెరికా పూర్తిగా విఫలమైందంటూ.. వారి భద్రతా వలయం అంతా చిల్లులమయమేనని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు జరుగుతున్న దాడులను బట్టి అమెరికాకు కేవలం ఇజ్రాయెల్ ప్రయోజనాలే ముఖ్యమని.. అరబ్ దేశాలు ఇప్పటికైనా మేల్కొని అమెరికాను తమ ప్రాంతం నుంచి వెళ్లగొట్టాలని ఆ దేశాలకు పిలుపునిచ్చారు. చైనాను సాయం కోరడం ద్వారా అమెరికా తన అసమర్థతను బయటపెట్టుకున్నట్లుగా ఇరాన్ విమర్శించింది.

కాగా ఈ యుద్ధం(War) వల్ల మన దేశ వాణిజ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా భారత నౌకాదళం రంగంలోకి దిగింది. పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్‌కు వచ్చే చమురు, వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడమే టార్గెట్‌గా మన యుద్ధనౌకలు అక్కడ మోహరించాయి. ప్రస్తుతం అక్కడ 24 భారత నౌకలు సిద్ధంగా ఉన్నట్లు.. అందులో 668 మంది నావికులు పహారా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా జలసంధికి తూర్పు వైపున మరో 3 నౌకల్లో 76 మంది నావికులను నిరంతరం భారత్ ప్రభుత్వం కాపలా ఉంచింది. దీంతో భారత దేశానికి వచ్చే ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా భారత్ తన శక్తిని చాటుతున్నట్లు తెలుస్తోంది.





