Just NationalLatest News

Biryani Controversy : రూ. 370 బిర్యానీ కాంట్రవర్సీ..ఇప్పుడు బాస్‌నూ వదలమంటున్న నెటిజన్లు

Biryani Controversy : ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో ఒక ఆడియన్.. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతూ, కేవలం 370 రూపాయలకు చికెన్ బిర్యానీ తినిపిస్తే..

Biryani Controversy

సోషల్ మీడియాలో ఒక్కోసారి చిన్న చిచ్చు కూడా పెద్దగా మారుతుంది .ఏకంగా దాని వల్ల జాబ్ కూడా ఊస్ట్ అయ్యేలా పరిస్థితులు తలెత్తాయి. అలాగే రెండు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతున్న రూ. 370 బిర్యానీ కాంట్రవర్సీ(Biryani Controversy).. ఒక యువకుడి ఉద్యోగానికే ఎసరు పెట్టింది.

ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో ఒక ఆడియన్.. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతూ, కేవలం 370 రూపాయలకు చికెన్ బిర్యానీ తినిపిస్తే.. వారిపై శారీరకంగా కూడా హక్కు వచ్చేస్తుందనే రేంజ్‌లో బిల్డప్ ఇవ్వడమే ఈ రచ్చ అంతటికీ కారణం.

హిమాన్షు జంగ్రా అనే యువకుడు వీడియోలో వాగిన మాటలు వింటే ఎవరికైనా చిర్రెత్తాల్సిందే. ఒక అమ్మాయితో కలిసి డేట్‌కి వెళ్లినప్పుడు తాను భోజనానికి రూ. 370 బిల్ కట్టానని, ఆ తర్వాత తనను డ్రాప్ చేయమని ఆ అమ్మాయి అడిగితే తనకు మైండ్ బ్లాక్ అయిందని చెప్పాడు.

ఎందుకంటే తను అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఆ రూ. 370 కి రిటర్న్స్ కింద ఫిజికల్ ఇంటిమసీ అంటే శారీరక సాన్నిహిత్యం ఆశించాడట. రూ. 370 ఖర్చు పెట్టాక ఆ మాత్రం వసూలు చేసుకోనా అంటూ అతడు వేసిన చీప్ డైలాగ్స్ అతను కూడా ఊహించని రేంజ్‌లో సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించాయి.

ఈ వీడియో బయటకి రాగానే నెటిజన్లు, ముఖ్యంగా అమ్మాయిలు హిమాన్షుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ట్రోలింగ్, నెగెటివిటీ పీక్స్‌కి వెళ్లడంతో రూట్ మార్చిన ఆ యువకుడు.. అందరికీ సారీ చెప్పి తన సోషల్ మీడియా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నాడు.

కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఈ రూ. 370 బిర్యానీ ఇష్యూ కాస్తా గురుగ్రామ్‌లోని అతడి కంపెనీ వరకు వెళ్లడంతో, మేనేజ్‌మెంట్ అతడిని ఆఫీస్ నుంచి టెర్మినేట్ చేస్తూ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

గురుగ్రామ్‌లోని స్టార్విక్ డిజైన్ అనే కంపెనీలో హిమాన్షు ఉద్యోగం చేసేవాడు. ఈ ఇష్యూ సీరియస్ అవ్వడంతో ఆ కంపెనీ ఫౌండర్ వివేక్ విశ్వకర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ షేర్ చేస్తూ.. అతనిని ఉద్యోగం నుంచి ఫైర్ చేసినట్లు అనౌన్స్ చేశారు.

ఆయన తన పోస్ట్‌లో.. 24 గంటలుగా మా ఎంప్లాయ్ హిమాన్షు ప్రవర్తనపై తనకు వందల కొద్దీ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఆ వైరల్ క్లిప్స్ తాను కూడా చూశానని.. అతడు మాట్లాడిన మాటలు అత్యంత అసహ్యకరమైనవని అన్నారు. వాటిని తాను కానీ, తమ కంపెనీ కానీ అస్సలు సపోర్ట్ చేయవు. ఇలాంటి మైండ్‌సెట్ యువతను తప్పుదోవ పట్టిస్తుందని గట్టిగా చెప్పారు.

కాకపోతే ఆఫీస్‌లో హిమాన్షు ట్రాక్ రికార్డ్ బాగుందని వివేక్ కంక్లూజన్ ఇచ్చారు. తాము ఇంటర్నల్‌గా మా లేడీ ఎంప్లాయిస్‌తో సహా అందరినీ అడిగి తెలుసుకున్నామని.. కానీ ఆఫీస్ లోపల అతడిపై ఒక్క నెగెటివ్ రిమార్క్ కూడా లేదని అన్నారు.

Biryani Controversy
Biryani Controversy

కానీ, ఆఫీస్ బయట హిమాన్షు చూపించిన బుద్ధి వల్ల కంపెనీ రెప్యుటేషన్‌ దెబ్బతినే పరిస్థితి వచ్చిందని అన్నారు. తన టీమ్‌ను, క్లయింట్లను ,వర్క్‌ప్లేస్ ఎన్విరాన్‌మెంట్‌ను కాపాడటం తన బాధ్యత అని.. అందుకే అతనికి బైబై చెప్పేయాలని డిసైడ్ అయ్యామని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. హిమాన్షు చేసిన తప్పును తెలుసుకుని మారడానికి సొసైటీ కాస్త స్పేస్ ఇవ్వాలంటూ వివేక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో కొత్త రచ్చకు దారితీశాయి.

ఎందుకంటే నెటిజన్లు ఈ సింపతీ కార్డును అస్సలు ఒప్పుకోవడం లేదు. తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తున్నారంటూ వివేక్ పోస్ట్‌పై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.

మన సొసైటీలో ఆల్రెడీ మహిళలపై వివక్ష పీక్స్‌లో ఉందని.. అలాంటిది 22 ఏళ్ల కుర్రాడికి ట్రోలింగ్ వల్ల ఇబ్బంది అవుతుందని వివేక్ కవర్ చేయడం చూస్తుంటే, జాబ్ తీసేసినా అతడి సైడే నిలబడుతున్నట్లు ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Vishaka Steel Plant : స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి భద్రతా లోపాలే కారణమా?ఈ పదేళ్లలో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగాయి?

Related Articles

Back to top button