Just InternationalJust NationalLatest News

Honey Trap : బోర్డర్ దాటుతున్న డిఫెన్స్ సీక్రెట్స్..రక్షణ దళాలు కూడా హనీట్రాప్ మాయలో ఎందుకు పడతాయి?

Honey Trap : శత్రు ఏజెంట్లు ఫస్ట్‌లోనే సైనిక రహస్యాలు అడగరు. ముందుగా వారి పర్సనల్ బాధలను వింటూ సానుభూతి చూపిస్తారు.

Honey Trap

కఠినమైన శిక్షణ.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే క్రమశిక్షణ, దేశం కోసం ప్రాణాలను కూడా ఇచ్చేంత దేశభక్తి.. ఇవన్నీ ఉన్న మన డిఫెన్స్ ఫోర్స్‌ను.. శత్రుదేశాలు శస్త్రాలతో కాకుండా కేవలం అమ్మాయి వలపు వలతో ముప్పతిప్పలు పెడుతున్నాయి. తాజాగా ఇలాగే విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం (ENC) కేంద్రంగా వెలుగు చూసిన తాజా హనీట్రాప్(Honey Trap) వ్యవహారం ఇప్పుడు డిఫెన్స్ సర్కిల్స్‌లో వణుకు పుట్టిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ 2014లో ఇండియన్ నేవీలో చేరి, విశాఖ బేస్‌లో ప్రస్తుతం సైలర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో పరిచయమైన ఒక పాకిస్తాన్ మహిళా ఏజెంట్ నకిలీ ప్రొఫైల్ అందాలకు ప్రదీప్ ముగ్ధుడయ్యాడు.

ఆపై ఆమె వేసిన స్కెచ్‌లో పడిపోయి, విశాఖ నావల్ బేస్ నుంచి యుద్ధనౌకలు, సబ్‌మెరీన్‌ కదలికలు, అంతర్గత సైనిక ఇన్ఫర్మేషన్ ఇలా మొత్తం వివరాలను బోర్డర్ దాటించాడు. ప్రదీప్ డిజిటల్ కదలికల ఆధారంగా నిఘా పెట్టిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ , నావల్ ఇంటెలిజెన్స్.. పక్కా ఆధారాలతో కోయంబత్తూరులో ప్రదీప్‌ను అదుపులో తీసుకున్నాయి.

అయితే, విశాఖ తీరానికి ఇది కొత్త కథేమీ కాదు. గతంలో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ (ISI) ఏజెంట్లు సోషల్ మీడియాలో నేవీ ఉద్యోగులకు వల వేసి, వీడియో కాల్స్ ద్వారా న్యూడ్ వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. యుద్ధనౌకల సీక్రెట్ లొకేషన్ల కోసం.. హవాలా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు గుమ్మరించిన ఆ పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించడానికి గతంలో ఏపీ సీఐ, ఐబీ, నేవీ ఇంటెలిజెన్స్ కలిసి ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ చేపట్టి ఏకంగా 11 మందిని అరెస్ట్ చేశాయి.ఎన్ఐఏ కూడా ఈ కేసు విచారణను చేపట్టింది.

అయినా కూడా ఇప్పుడు మళ్లీ ప్రదీప్ రూపంలో అదే సీన్ రీపీట్ అవడంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ షాక్‌కు గురయ్యాయి. అయితే ఇతని ద్వారా ఎంత వరకు సమాచారం లీక్ అయ్యింది, ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా, ఇంకా ఎవరైనా పాక్ ఏజెంట్ల వలలో ఉన్నారా అనే యాంగిల్‌లో బ్యాంక్ అకౌంట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై దర్యాప్తు జరుగుతోంది. దీనిలో భాగంగా ఆర్మీ, నేవీ ఉన్నతాధికారులు, సిబ్బంది మొబైల్ వాడకంపై మరింత కఠిన ఆంక్షలు విధించారు.

అయితే ప్రాణాలకు తెగించి దేశాన్ని అహర్నిశలు కాపాడే ఆర్మీ, నేవీ సిబ్బందికి.. హనీట్రాప్(Honey Trap) ప్రమాదం గురించి తెలిసీ కూడా.. శత్రువుల మోజులో ఎందుకు పడిపోతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

దీని వెనుక సైకలాజికల్, సోషల్ కారణాలు చాలా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముందుగా ఐసోలేషన్ అండ్ డిస్టెన్స్ వల్ల.. రక్షణ సిబ్బంది తమ ఫ్యామిలీలకు, ఆత్మీయులకు నెలలు, సంవత్సరాల తరబడి దూరంగా.. కఠిన వాతావరణంలో పని చేస్తుంటారు. వారి లైఫ్‌లో మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో పరిచయమైన ఒకరు.. ఎంతో శ్రద్ధగా తమ మాటలు వింటున్నట్లు, ప్రేమను ఒలకబోస్తున్నట్లు ఉంటే త్వరగా అట్రాక్ట్ అయిపోతారు.

అలాగే నకిలీ సానుభూతి అండ్ డిజిటల్ ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ వల్ల జరుగుతుంది. అందమైన ఫోటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసే శత్రు ఏజెంట్లు ..ఫస్ట్‌లో సైనిక రహస్యాలు అడగరు. ముందుగా వారి పర్సనల్ బాధలను వింటూ సానుభూతి చూపిస్తారు. మెల్లగా మానసిక బంధం ఏర్పడ్డాక, నువ్వు పనిచేసే వర్క్ ప్లేస్ ఫోటో పంపు చూస్తాను..నీ డ్యూటీ డ్రెస్‌లో ఎలా ఉంటావో చూపించు అంటూ మెల్లగా సీక్రెట్లను రాబడతారు.

Honey Trap
Honey Trap

ఇక బ్లాక్‌మెయిలింగ్ అండ్ హనీ మనీ ఫ్యాక్టర్ రీజన్ కూడా ఉంటుంది. ఒక్కసారి పర్సనల్ సంభాషణలు, వీడియో కాల్స్ సాగాక.. వారి న్యూడ్ వీడియోలను వారు రికార్డు చేస్తారు. అక్కడి నుంచే అసలు రచ్చ మొదలవుతుంది. ఈ విషయం బయటపడితే సొసైటీలో పరువు పోతుందనే భయం, ఉద్యోగం ఊడుతుందనే టెన్షన్ల వల్ల వారి బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిపోతారు. దానికి తోడు హవాలా రూపంలో వచ్చే భారీ డబ్బుల ఆశ కూడా వారిని ఆ ఊబి నుంచి బయటకు రాకుండా చేసేస్తుంది.

అయితే డిఫెన్స్ రంగంలో ఉన్నవారికి కఠినమైన రూల్స్, మొబైల్ ఫోన్ల వాడకంపై నిఘా పెట్టినంత మాత్రాన ఈ హనీట్రాప్(Honey Trap) మాయాజాలానికి పూర్తిగా చెక్ పెట్టేలేము. డిఫెన్స్ రంగంలో వారికి కేవలం శారీరక శిక్షణ మాత్రమే కాకుండా, డిజిటల్ సైకాలజీ, సైబర్ సెక్యూరిటీపైన కూడా ఎప్పుడూ కౌన్సెలింగ్ ఇవ్వడం, ఆన్-లైన్ స్మార్ట్ ట్రాప్‌లను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలర్ట్ సిస్టమ్‌లను వాడటం కూడా చేయాలి.

Form – 6 : ఫారం–6 వెనుక ఉన్న హ్యాండ్ ఎవరిది?.. సుప్రీంకోర్టు ప్రశ్నలకు ఈసీ దగ్గర ఆన్సర్ ఉందా?

Related Articles

Back to top button