Just InternationalLatest News

Iran : ఇరాన్ కొత్త మిస్సైల్ విధ్వంసం.. అమెరికా ఆర్మీ చేతులెత్తేంత ప్రత్యేకతలు ఏమున్నాయి?

Iran : అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన అత్యంత అధునాతన క్షిపణులలో ఒకటైన ఖైబర్ షెకాన్ మిస్సైల్‌ను కూడా రంగంలోకి దించి గల్ఫ్ రీజియన్‌ను వణికిస్తోంది.

Iran

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్(Iran) తన అత్యంత అధునాతన క్షిపణులలో ఒకటైన ఖైబర్ షెకాన్ మిస్సైల్‌ను కూడా రంగంలోకి దించి గల్ఫ్ రీజియన్‌ను వణికించేస్తోంది. నిజానికి ఇరాన్ రక్షణ బలాన్ని అమెరికా తక్కువ అంచనా వేసింది. ఈ స్థాయిలో జవాబిస్తుందని అగ్రదేశం అస్సలు అనుకోలేదు.

ఇపుడు ఖైబర్ షెకాన్ దెబ్బకు అమెరికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఫతా 1,2 లను కూడా బరిలోకి దించింది. ఇరాన్ ప్రయోగిస్తున్న ఈ క్షిపణుల గురించి ప్రపంచ దేశాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఖైబర్ షెకాన్ ప్రత్యేకతలు చూస్తే కనుక.. ఈ మీడియం-రేంజ్ బాలిస్టిక్ క్షిపణికి టెర్మినల్ ఫేజ్‌లో తన ప్రయాణ మార్గాన్ని మార్చుకోగల ప్రత్యేక రెక్కలు ఉంటాయి. ఇది గాల్లో గంటకు సుమారు 9600 మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది.

దీని అధునాతన టెక్నాలజీ వల్ల అమెరికాకు చెందిన పేట్రియాట్ థాడ్ వంటి క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలు కూడా దీనిని అడ్డుకోవడం కష్టంగా మారింది. శత్రుదేశాల డిఫెన్స్ ఇంటర్‌సెప్టార్ల కంటే ఇది చాలా చౌకగా తయారవుతుంది. సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది కచ్చితత్వంతో ఛేదించగలదు.

అలాగే ఫతా సిరీస్ అనేది ఇరాన్ సొంతంగా తయారు చేసుకున్న మొదటి హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. దీని రేంజ్ 1,400 కిలోమీటర్లు. ఇది కేవలం 6 నుంచి 7 నిమిషాల్లోనే లక్ష్యాన్ని రీచ్ అవగలదు. ఇరాన్ దీనిని మరింత అప్‌గ్రేడ్ చేసి ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి రకంగా మార్చింది. ఇది శబ్ద వేగం కంటే 17 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Iran
Iran

తన మిస్సైల్ నిల్వల నుంచి జోల్ఫాగర్, ఫతే-110 , ఖియామ్ వంటి బాలిస్టిక్ క్షిపణులను, అలాగే పావెహ్ క్రూయిజ్ క్షిపణులను కూడా ఇరాన్ వాడుతోంది. ఇటీవల అమెరికా డ్రోన్‌ను కూల్చివేయడానికి ఇరాన్ ఆరాష్-ఇ కమంగీర్ అనే సరికొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా మొదటిసారిగా ప్రయోగించింది. వీటన్నిటి కంటే కూడా ఇరాన్ తీసుకొచ్చిన అడ్వాన్స్‌డ్ ఖైబర్ షెకాన్ క్షిపణులు అమెరికా సైనిక సామర్థ్యానికి సవాల్ విసురుతున్నాయి.

Date Of Birth : ఏ నెంబర్ వారికి మనీ, కెరీర్ పరంగా గ్రాండ్ సక్సెస్? వారి అదృష్టం ఎలా ఉండబోతోంది?

Related Articles

Back to top button