LPG Crisis:యుద్ధ సెగలు.. దేశాన్ని వణికిస్తున్న ఎల్పీజీ సంక్షోభం ఎటు దారి తీస్తుంది?
LPG Crisis: పీజీలు, కోలివింగ్‌లను కమర్షియల్ కేటగిరీ కింద పరిగణించడంతో వారందరికీ గ్యాస్ సప్లై నిలిచిపోయింది.
LPG Crisis
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడి జీవితాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు సప్లైలో ఏర్పడిన అంతరాయం వల్ల భారతదేశంలో ఎల్పీజీ కొరత ఊహించని స్థాయికి చేరిపోయింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 5 నుంచి ఎమర్జెన్సీ అధికారాలను ఆక్టివేట్ చేసి, దేశవ్యాప్తంగా 4 అంచెల ప్రణాళికను అమలు చేస్తోంది.
దీనిలో భాగంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ప్రకారం ఐఓసీఎల్(IOCL),హెచ్‌పీసీఎల్ (HPCL) వంటి ప్రధాన రిఫైనరీలన్నీ తమ వద్ద ఉన్న ప్రోపేన్ , బ్యూటేన్‌ను వంద శాతం ఎల్పీజీ ఉత్పత్తికే(LPG Crisis) మళ్లించాలని ఆదేశించింది. దీనివల్ల గృహ అవసరాలకు గ్యాస్ కొరత(LPG Crisis) లేకుండా చూడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం దేశంలోని 33 కోట్ల గృహాలకు, సీఎన్జీ రవాణాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ, వాణిజ్యపరమైన అవసరాలను నిలిపివేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల రెస్టారెంట్లు , వేలాది పీజీ హాస్టళ్లు గ్యాస్ అందక మూతపడే స్థితికి చేరుకున్నాయి.
ఈ ప్రభావం కేవలం వంటగదికే పరిమితం కాలేదు. ఎరువుల తయారీ సంస్థలు , విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కూడా గ్యాస్ సరఫరాను తగ్గించడం వల్ల ఫ్యూచర్లో వ్యవసాయం, విద్యుత్ రంగాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఎన్ఆర్ఏఐ వంటి సంఘాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి, ఈ రంగానికి ఎమర్జెన్సీ హోదా కల్పించాలని కోరాయి.
గ్యాస్ కొరత(LPG Crisis)ను సాకుగా తీసుకుని బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ల ధరలను విపరీతంగా పెంచేయడంతో మరో పెద్ద సవాలు ఎదురయింది. ప్రభుత్వం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల నుంచి అత్యవసర దిగుమతుల కోసం చర్చలు జరుపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, మన వద్ద ఉన్న స్ట్రాటజిక్ రిజర్వ్‌లను వాడుకోవాలని సూచించారు.
దేశ ప్రజల్లో భయాందోళనలు కలగకుండా ఉండటానికి ప్రభుత్వం బుకింగ్ ఇంటర్వెల్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచడం వంటి మార్పులు చేసింది. యుద్ధం మరికొంత కాలం కొనసాగితే ఇండస్ట్రియల్ రంగం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ప్లాన్-బి దిశగా అడుగులు వేస్తోంది.
మరోవైపు ఒక్క రెస్టారెంట్లే కాకుండా, బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీలో వేలాదిగా ఉన్న పీజీ హాస్టళ్లు కూడా ఈ గ్యాస్ కష్టాల్లో చిక్కుకున్నాయి. పీజీలు, కోలివింగ్‌లను కమర్షియల్ కేటగిరీ కింద పరిగణించడంతో వారందరికీ గ్యాస్ సప్లై నిలిచిపోయింది. దీనివల్ల చాలా పీజీలలో వంటలు ఆగిపోయి, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌లు బయట తినలేక, లోపల వండి పెట్టేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కొన్ని పీజీలు ఇప్పటికే టెంపరరీగా మూతపడ్డాయి. ప్రభుత్వం ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955.. కింద ఎమర్జెన్సీ అధికారాలను ఆక్టివేట్ చేసింది. ఐఓసీఎల్ (IOCL), హెచ్‌పీసీఎల్ (HPCL) వంటి కంపెనీలు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది.
మరోవైపు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల నుంచి అత్యవసరంగా గ్యాస్ దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ, వంటింటి గ్యాస్ కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే యుద్ధం మరికొద్ది రోజులు కొనసాగితే మాత్రం ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పీజీల్లో ఉండేవారు ఇండక్షన్ స్టవ్‌లను వాడుకోవడం మంచిది.





