Just InternationalJust PoliticalLatest News

Mojtaba Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ హెల్త్ తీవ్ర విషమం..ఇజ్రాయిల్ మీడియా రిపోర్ట్‌లో వాస్తవమెంత?

Mojtaba Khamenei : ఫిబ్రవరి 28న అమెరికా , ఇజ్రాయిల్ బలగాలు కలిసి జరిపిన విధ్వంసకర దాడి తర్వాత మొజ్తబా ఖమేనీ తన మంత్రివర్గ సభ్యులను కూడా ప్రత్యక్షంగా కలవలేదని ఆ దేశానికి చెందిన మీడియా చెబుతోంది.

Mojtaba Khamenei

మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్‌లో కొద్దిరోజులుగా ఊహించని ఉత్కంఠ నెలకొంటుంది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ(Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. మొజ్తబా ఖమేనీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, ఏ క్షణంలోనైనా ఆయన మరణ వార్త వినాల్సి రావొచ్చంటూ ఇజ్రాయిల్ అలాగే కొన్ని విదేశీ మీడియా సంస్థలు చెబుతున్నాయి.

ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఖమేనీ బయటకు రాకపోవడం, కనీసం బహిరంగ సభల్లో, చివరకు టీవీల్లో కూడా కనిపించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లు అవుతోంది.

ఇజ్రాయిల్‌కు చెందిన ప్రముఖ ఛానల్ ప్రచురించిన వార్తా కథనం ప్రకారం.. ఇరాన్‌లోని తమ నమ్మకమైన వర్గాల సమాచారంతో మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్‌వైర్ మీడియా కూడా అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత వ్యక్తుల గురించి చెబుతూ మైండ్ బ్లాకింగ్ విషయాలను బయటపెట్టింది.

ఫిబ్రవరి 28న అమెరికా , ఇజ్రాయిల్ బలగాలు కలిసి జరిపిన విధ్వంసకర దాడి తర్వాత మొజ్తబా ఖమేనీ తన మంత్రివర్గ సభ్యులను కూడా ప్రత్యక్షంగా కలవలేదని ఆ దేశానికి చెందిన మీడియా చెబుతోంది. దాడిలో ఖమేనీకి తీవ్ర గాయాలయ్యాయని, ప్రైవేట్ డాక్టర్ల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పొందుతున్నారని ప్రచారం సాగుతోంది.

అంతేకాదు మొజ్తబా హెల్త్ కండీషన్ అస్సలు బాగోలేదని, ఏ క్షణంలోనైనా ఖమేనీ మరణవార్త వెలువడినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇరాన్ అత్యున్నత వర్గాల్లోనే అంతర్గత చర్చ నడుస్తోంది. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఖమేనీ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన ఎలాంటి ప్రసంగాలు చేయలేదు.

కేవలం మొజ్తబా ఖమేనీ పేరు మీద ఇరాన్ అధికారిక మీడియా కొన్ని రాతపూర్వక ప్రకటనలను రిలీజ్ చేస్తూ వస్తోంది. దాంతోనే మొజ్తబా నిజంగానే బతికి ఉన్నారా లేదంటే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్‌పై ఉన్నారా అనే అనుమానాలు సొంత దేశంలోనూ కూడా రెట్టింపవుతున్నాయి.

కాగా మొజ్తబా ఖమేనీ ఎక్కడ చికిత్స పొందుతున్నారనే దానిపైన కూడా రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. రష్యా రాజధాని మాస్కోలోని ఒక పెద్ద హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని కొన్ని కథనాలు చెబుతుంటే .. ఇరాన్‌లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్‌లో చికిత్స జరుగుతోందని మరికొన్ని కథనాలు పేర్కొంటున్నాయి.

Mojtaba Khamenei
Mojtaba Khamenei

దీనికి తోడు ఇరాన్ పవిత్ర నగరమైన కోమ్‌లోని ఒక సీక్రెట్ ప్లేస్‌లో మొజ్తబాకు డాక్టర్లు సేవలు అందిస్తున్నారని మరికొన్ని ఇంటర్నేషనల్ రిపోర్టులు చెబుతున్నాయి. అయితే అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో మొజ్తబాకు తీవ్ర గాయాలేమీ కాలేదని, ఇదంతా శత్రు దేశాలు వ్యాప్తి చేస్తున్న అవాస్తవ ప్రచారమని ఇరాన్ వర్గాలు ఖండిస్తున్నాయి.

తాజాగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ .. సుప్రీం లీడర్‌తో ప్రస్తుతం నేరుగా కమ్యూనికేషన్ కష్టంగా మారిన మాట నిజమే అని ఒప్పుకున్నా కూడా.. ప్రభుత్వానికి మొజ్తబా ఖమేనీ(Mojtaba Khamenei)నే ప్రధాన బలమని వ్యాఖ్యానించడం గమనార్హం.

Gold Price : గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. రాకెట్‌లా దూసుకెళ్తున్న బంగారం,వెండి.. జ్యువెలరీ కొనేముందు ఇవి తెలుసుకోండి..

Related Articles

Back to top button