SpaceX IPO : స్పేస్‌ఎక్స్ ఐపీఓ దెబ్బకు రూ. 95 లక్షల కోట్లు.. ప్రపంచాన్నే కొనగల రేంజ్‌కు ఎలన్ మస్క్
SpaceX IPO : ఎలన్ మస్క్ వరల్డ్‌లోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించారు. వన్ ట్రిలియన్ డాలర్లు అంటే అక్షరాలా ఒకటి పక్కన పన్నెండు సున్నాలుంటాయి
SpaceX IPO
వరల్డ్‌లోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే చిన్న పిల్లాడు కూడా ఎలన్ మస్క్ అని చెప్పేస్తాడు. మస్క్ చేసే ట్వీట్లు, ఆయన పెట్టే రూల్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో సెన్సేషనే. అయితే ఇప్పుడు మస్క్ క్రియేట్ చేసిన హిస్టరీ మామూలుది కాదు. జూన్ 12, 2026 న వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్‌లో ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్(SpaceX IPO) కంపెనీ ఐపీఓ ఊహించని రేంజ్‌లో లాభాల్లో దూసుకెళ్లింది.
ఈ దెబ్బతో ఎలన్ మస్క్ వరల్డ్‌లోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించారు. వన్ ట్రిలియన్ డాలర్లు అంటే అక్షరాలా ఒకటి పక్కన పన్నెండు సున్నాలుంటాయి. ప్రెజెంట్ మస్క్ నికర ఆస్తి విలువ 1.1 ట్రిలియన్ డాలర్లను దాటేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 95 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే.
సాధారణంగా ఒక మనిషి తన జీవితకాలంలో ఒక మిలియన్ డాలర్లు సంపాదిస్తేనే ఆహా, ఓహో అనుకుంటారు. కానీ మస్క్ సంపాదించిన ఈ ఒక ట్రిలియన్ డాలర్ల విలువ ఎంతంటే, ఒకరు ప్రతిరోజూ గంటకు ఒక మిలియన్ డాలర్లు చొప్పున తనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ పోయినా, ఆ డబ్బు మొత్తం ఖాళీ అవ్వడానికి వందేళ్లకు పైగా టైమ్ పడుతుంది.
ప్రతి సెకనుకు ఒక డాలర్ చొప్పున లెక్కపెడితే ఒక ట్రిలియన్ డాలర్లను లెక్కపెట్టడానికి సుమారు 31,700 ఏళ్లు పడుతుంది. అలాగే రోజుకు ఒక కోటి రూపాయలు ఖర్చు చేసినా కూడా, ఈ ఆస్తిని కరిగించడానికి 27 వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయమే పడుతుంది.
మస్క్ ఒంటరిగా సంపాదించిన ఈ ఆస్తి ..వరల్డ్‌లోనే సుమారు 170 దేశాల వ్యక్తిగత జీడీపీ కంటే ఇది చాలా ఎక్కువ. అంటే కొన్ని వందల దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే కూడా ఎలన్ మస్క్ ఒక్కడి సంపదే పెద్దదన్నమాట.

ఇప్పుడు వరల్డ్‌లో టాప్ బిలియనీర్లుగా ఉన్న అమెజాన్ జెఫ్ బెజోస్,గూగుల్ లారీ పేజ్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, సెర్గే బ్రిన్.. వీళ్లందరి ఆస్తులను కలిపితే ఎంత వస్తుందో, అంత ఆస్తి ఒక్క ఎలన్ మస్క్ దగ్గరే ఇప్పుడు ఉంది.
అంతరిక్షంలోకి రాకెట్లను పంపే స్పేస్‌ఎక్స్(SpaceX IPO), రోడ్ల మీద దూసుకెళ్లే టెస్లా కార్లు, అందరూ వాడే ఎక్స్ (ట్విట్టర్) వంటి క్రేజీ కంపెనీలతో మస్క్ ఈ స్థాయికి చేరారు.
Brain : ఆకలి, నొప్పి, అలసట..మనల్ని సేఫ్‌గా ఉంచడానికి బ్రెయిన్ చెప్పే అబద్ధాలట.





