Mammogram : మామోగ్రామ్స్ వెనుక మెడికల్ మాఫియా ఉందా?..బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులపై వైరల్ అవుతోన్నపోస్టులపై నిజాలేంటి?
Mammogram : తాజాగా స్విట్జర్లాండ్ దేశం మామోగ్రఫీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులను పూర్తిగా బ్యాన్ చేసిందనే వార్త వైరల్ అయింది.
Mammogram
ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ఒక్క వార్త వేలాది మందిని ఎంతగా టెన్షన్ పెడుతుందో చెప్పడానికి ఈ లేటెస్ట్ మేటరే బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. తాజాగా స్విట్జర్లాండ్ దేశం మామోగ్రఫీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులను పూర్తిగా బ్యాన్ చేసింది.. విపరీతంగా డబ్బులు గుంజడానికి ఇన్నాళ్లూ మెడికల్ కంపెనీలు ఆడిన పెద్ద డ్రామా మామోగ్రఫీ అంటూ ఎక్స్, వాట్సాప్ గ్రూపుల్లో వరుస పోస్టులు తెగ హల్చల్ చేశాయి.
డాక్టర్లను, హాస్పిటళ్లను టార్గెట్ చేస్తూ వైరల్ అవుతోన్న ఆ సుదీర్ఘమైన పోస్ట్ చూసి ప్రపంచవ్యాప్తంగా మహిళలంతా ఉలిక్కిపడ్డారు. కానీ అవన్నీ కూడా కేవలం లైక్‌లు, వ్యూస్ కోసం కొంతమంది అల్లిన ఫేక్ స్టోరీలని, స్విట్జర్లాండ్‌లో అసలు అలాంటిదేమీ జరగలేదని ఆ దేశ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
అసలు ఈ సోషల్ మీడియా రచ్చ ఎక్కడ స్టార్ట్ అయిందనే విషయానికి వస్తే.. 2014లో అంటే 12 సంవత్సరాల క్రితం స్విట్జర్లాండ్‌లోని వివిధ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ల కమిటీ.. మామోగ్రఫీ టెస్టుల వల్ల కొందరికి అనవసరంగా భయం పెరిగే అవకాశం ఉందేమోనని ఒక రీసెర్చ్ పేపర్లో డిస్కస్ చేశారు.
కానీ అక్కడ ఎవరూ కూడా దానిని గవర్నమెంట్ రూల్‌గా మార్చలేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ మేటర్‌ను సీరియస్‌గానే తీసుకోనేలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా స్విట్జర్లాండ్‌లో 45 ఏళ్లు దాటిన మహిళలందరికీ మామోగ్రఫీ టెస్టులు ఫ్రీగా, పక్కాగా జరుగుతూనే ఉన్నాయి.
దీనిలో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ నెగిటివ్ వైబ్స్ భారతదేశంలో కూడా పాకాయి. ఇండియాలో మహిళల్లో ఎక్కువగా కనిపించేది బ్రెస్ట్ క్యాన్సరే. అయితే ముందు ఇక్కడి మహిళలకు భయం, సిగ్గు వల్ల టెస్టుల వరకూ వెళ్లడానికి భయపడతారు. ఇలాంటి టైమ్‌లోనే మామోగ్రఫీ వేస్ట్ అని, దానివల్ల క్యాన్సర్ ఇంకా పెరుగుతుందని, 60 శాతం రాంగ్ రిపోర్ట్స్ వస్తాయని వైరల్ అవుతున్న మెసేజులతో మరింత వెనుకడుగు వేస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే ఈ టెస్టులు చేయించుకున్నవారంతా భయంతో వణికిపోతున్నారు. తాము డౌట్ క్లియర్ చేసుకోవడానికి మామోగ్రఫీ చేయించుకుంటే.. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా తమకు ఇప్పుడు ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నారు. కాగా ఇప్పుడు స్విట్జర్లాండ్ ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
మొత్తంగా మామోగ్రఫీలో వాడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు భారత దేశపు టాప్ డాక్టర్లు చెప్తున్నారు. ఏటా ఈ టెస్టుల వల్లే లక్షలాది మందికి క్యాన్సర్ ముందే బయటపడి ప్రాణాలు నిలుస్తున్నాయని చెబుతూ ఉదాహరణలు చూపిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇంటర్నెట్లో లైక్స్ కోసం రాసే ఇల్యూజన్ పోస్టులను, రూమర్లను పట్టించుకోకుండా.. బాడీలో ఏ చిన్న డౌట్ ఉన్నా డాక్టర్ని కలవాలన్నదే మైండ్‌లో పెట్టుకోవాలి.
🔻BREAKING: SWITZERLAND BANS MAMMOGRAPHY – THE MEDICAL FRAUD UNVEILED
Switzerland has just become the first country to ban mammography, exploding the truth behind one of the biggest frauds in medical history. For decades women have been terrorized, misdiagnosed and mutilated by…
— Mr. Pool (@MrPool_QQ) August 19, 2026





