US Green Card : యూఎస్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారా?..సెప్టెంబర్ 18 నుంచి న్యూ రూల్స్.. ఇండియన్స్‌కి కొత్త టెన్షన్
US Green Card : ప్రజెంట్ వాడుకలో ఉన్న 2025 జనవరి 20 ఎడిషన్ ప్లేస్‌లో, 2026 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఎడిషన్‌తో కూడిన కొత్త ఫామ్‌ను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అమల్లోకి తెస్తుంది.
US Green Card
అమెరికాలో సెటిలయి ఎప్పటికైనా సొంత గ్రీన్ కార్డ్ కల నెరవేర్చుకోవాలని ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న టెక్కీలకు యూఎస్ గవర్నమెంట్ ఒక్కసారిగా షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో చాలా ముఖ్యమైన ఫామ్ I-485 విషయంలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) హెచ్చరిక జారీ చేసింది. చిన్న డేట్ మారినా, ఫామ్ వెర్షన్ తేడా వచ్చినా సరే ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా దరఖాస్తును చెత్తబుట్టలో పడేస్తామని తేల్చి చెప్పేసింది.
గ్రీన్ కార్డ్ స్టేటస్ అడ్జస్ట్‌మెంట్ కోసం వాడే ఫామ్ I-485లో న్యూ వెర్షన్‌ను తీసుకురాబోతున్నట్లు యూఎస్ సీఐఎస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ప్రజెంట్ వాడుకలో ఉన్న 2025 జనవరి 20 ఎడిషన్ ప్లేస్‌లో, 2026 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఎడిషన్‌తో కూడిన కొత్త ఫామ్‌ను అమల్లోకి తెస్తున్నారు.
అయితే సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత సమయం.. గ్రేస్ పీరియడ్ ఇచ్చి పాత ఫామ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఇచ్చేది లేదని ఏజెన్సీ కరాఖండిగా చెప్పేసింది. ఆన్‌లైన్ లేదా పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసే తేదీ ఆధారంగా సరైన ఫామ్ వెర్షన్‌ను మాత్రమే వాడాలి.
సెప్టెంబర్ 18వ తేదీ కంటే ముందే అప్లికేషన్‌ను సబ్మిట్ చేసేవారు పాత ఎడిషన్ (2025 జనవరి 20) ఫామ్‌ను వాడుకోవచ్చు. కానీ, సెప్టెంబర్ 18 వ తేదీ లేదా ఆ తర్వాత కనుక ఓల్డ్ ఫామ్‌ను ఉపయోగిస్తే, అసలు మీ క్వాలిఫికేషన్ వంటివి కూడా పరిశీలించకుండానే అప్లికేషన్‌ను స్ట్రెయిట్‌గా రిజెక్ట్ చేసేస్తారు.
అలాగని హడావుడిగా సెప్టెంబర్ 18 వ తేదీ కంటే ముందే న్యూ వెర్షన్ ఫామ్‌ను సబ్మిట్ చేసినా అది చెల్లదు. అంటే కొత్త ఫామ్‌ను కచ్చితంగా సెప్టెంబర్ 18 వ తేదీనో లేదంటే ఆ తర్వాతనో వాడాల్సి ఉంటుంది. అందుకే లాయర్లతో మాట్లాడి ఫైలింగ్ డేట్స్ విషయంలో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
ఈ ఆకస్మిక మార్పుకు పబ్లిక్ ఛార్జ్ రూల్స్ మెయిన్ రీజన్ అని తెలుస్తోంది. అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందే వ్యక్తి ఫ్యూచర్‌లో జీవనోపాధి కోసం పబ్లిక్ ఛార్జ్ అంటే ప్రభుత్వంపై భారం అవుతారా లేదా అని అసెస్ చేయడానికి ఈ రూల్‌ను వాడతారు. అక్కడ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ కండీషన్లు, అప్లికేషన్ ఫార్మాట్లు మారడం కామనే.

అయితే ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐటీ, మెడికల్, ఇంజనీరింగ్ ఫీల్డ్స్‌లో ఉంటూ.. కంట్రీ కోటా వల్ల ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వేలాది మంది ఇండియన్ప్‌పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫామ్ I-485 పెండింగ్‌లో ఉన్నప్పుడే వర్క్ పర్మిట్, ట్రావెల్ పర్మిషన్లు వంటివి వస్తాయి కాబట్టి ఈ ఫైలింగ్ ప్రాసెస్ అందరికీ చాలా ఇంపార్టెంట్.
కాగా ఇప్పుడు ఫైలింగ్ ఫీజుల్లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదని క్లారిటీ ఇచ్చిన యూఎస్ సీఐఎస్(USCIS) .. దరఖాస్తుదారులు వెంటనే తమ సైట్‌కి వెళ్లి కొత్త ఫామ్ ప్రివ్యూ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చెక్ చేసుకోవాలని సూచించింది.





