Quantum Valley:నాడు సైబరాబాద్.. నేడు క్వాంటం వ్యాలీ- అగ్రరాజ్యాల సరసన భారత్
Quantum Valley: అప్పుడు సైబరాబాద్ సృష్టికర్త అయితే చంద్రబాబు నాయుడు , ఇప్పుడు దేశం గర్వించేలా అమరావతిలో ..133-క్విబిట్ సామర్థ్యం గల క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నారు.
Quantum Valley
ఫిబ్రవరి 7, 2026.. ఈ తేదీని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. ఎందుకంటే ఒకప్పుడు ‘బిట్స్’ ప్రపంచంలో ఐటీ విప్లవాన్ని సృష్టించి.. తెలుగు నేల ఖ్యాతిని చాటిన ఏపీ సీఎం చంద్రబాబు, ఇప్పుడు ‘క్విబిట్స్’ (Qubits) యుగంలోకి కూడా అడుగుపెట్టేలా చేశారు.
అమరావతి వేదికగా భారత దేశపు మొట్టమొదటి ‘క్వాంటం హబ్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం ద్వారా, ఏపీ రాజధాని ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీ రేసులో టాప్‌లో నిలిచింది. క్వాంటం వ్యాలీ( Quantum Valley) అంటే కేవలం కంప్యూటర్ల వేగం పెరగడం మాత్రమే కాదు, ఇది ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య హోదాను నిర్ణయించే ఒక శక్తివంతమైన అస్త్రం అని అంటున్నారు నిపుణులు.
క్వాంటం టెక్నాలజీ ఎందుకు ముఖ్యం అంటే.. సాధారణ కంప్యూటర్లు ఏ లెక్కలను అయితే పూర్తి చేయడానికి వేల సంవత్సరాలు తీసుకుంటాయో, క్వాంటం కంప్యూటర్లు వాటిని కేవలం సెకన్లలో పరిష్కరిస్తాయి.
వాతావరణ మార్పులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందుల అన్వేషణ, సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి వంటి కష్టమైన సమస్యలను పరిష్కరించడంలో క్వాంటం కంప్యూటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుతం అమెరికాలోని గూగుల్ (Willow చిప్), ఐబీఎం వంటి సంస్థలు, అటు చైనా సురక్షిత క్వాంటం నెట్‌వర్క్‌ల కోసం బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. ఈ పోటీలో భారతదేశం వెనుకబడకుండా, అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దడం సీఎం చంద్రబాబు వ్యూహాత్మక విజయానికి పునాది అనే చెప్పొచ్చు.
అప్పుడు సైబరాబాద్ సృష్టికర్త అయితే చంద్రబాబు నాయుడు , ఇప్పుడు దేశం గర్వించేలా అమరావతిలో ..133-క్విబిట్ (133-qubit) సామర్థ్యం గల క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నారు.ఐబీఎం( IBM), టీసీఎస్(TCS) , ఎల్ అండ్ టీ(L&T )వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఇది సాకారం కాబోతోంది.
జాతీయ క్వాంటం మిషన్ (National Quantum Mission) లక్ష్యాలను భుజానికెత్తుకున్న సీఎం చంద్రబాబు.. అమరావతిని సింగపూర్, బోస్టన్ వంటి అంతర్జాతీయ టెక్ హబ్స్ సరసన నిలబెట్టడానికి కట్టుకున్నారు. పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లే,ఇప్పుడు ఈ క్వాంటం విప్లవాన్ని కూడా చంద్రబాబు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

క్వాంటం కంప్యూటింగ్ అందుబాటులోకి వస్తే సామాన్యుల జీవితాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి.
కచ్చితమైన వాతావరణ అంచనాలు.. తుపాన్లు, వర్షాల గురించి ముందే కచ్చితంగా తెలుసుకోవడం వల్ల రైతులకు ముందే అలర్ట్ అవుతారు.
వేగవంతమైన వైద్యం.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగంగా జరగడంతో..తక్కువ ఖర్చుతో కొత్త మందులు అందుబాటులోకి వస్తాయి.
సైబర్ భద్రత.. మన వ్యక్తిగత డేటా , దేశ రక్షణ వ్యవస్థలకు బీటలు వారని భద్రత లభిస్తుంది.
భారతదేశం ఇప్పటికే ముఖ్యంగా తెలుగు విద్యార్థులు స్టెమ్ (STEM ) అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాల్లో క్వాంటం వ్యాలీ( Quantum Valley) ప్రపంచంలోనే నిష్ణాతులుగా పేరు పొందారు. ఇప్పుడు ఐఐటీ, నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న మన పిల్లలు పడే కష్టం, వారికి ఇచ్చే బలమైన పునాది ఇప్పుడు ఈ క్వాంటం యుగానికి ఇంధనంగా మారబోతోంది .
తెలుగువారి మేధస్సు ప్రపంచాన్ని మన దగ్గరకు వచ్చేలా చేస్తోంది. ఇంకా చెప్పాలంటే 07/02/2026 నాటి ఈ అడుగు, అమరావతిని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ల కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే కాకుండా, భారత్‌ను గ్లోబల్ టెక్ లీడర్‌గా నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.



