Balakrishna : అతనిని నమ్మి మోసపోకండి: బాలకృష్ణ హెచ్చరిక
Balakrishna : ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు.

Balakrishna : ఎంతోమంది క్యాన్సర్ రోగులకు అండగా ఉండే బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి (Basavatarakam Hospital)పేరుతో కొందరు మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం కొత్త చర్చకు దారి తీసింది. ఇలాంటి మోసాలను నమ్మి ప్రజలు నష్టపోవద్దని ఆస్పత్రి ఛైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ సీరియస్‌గా హెచ్చరించారు. ఈ విషయంపై ఆయన సోషల్ మీడియాలో ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు.
Balakrishna
బాలకృష్ణ చేసిన ప్రకటన ప్రకారం.. ‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’ అనే పేరుతో అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి తన అనుమతి లేకుండా, అలాగే ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు ఆమోదం లేకుండానే విరాళాలు సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
“ప్రజలకు హెచ్చరిక! ‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, మరియు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు.
కాబట్టి నా విజ్ఞప్తి — దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు అని కోరారు.
సాధారణంగా ఇలాంటి మోసాలు వివిధ రూపాల్లో జరుగుతుంటాయి. కానీ, ప్రాణాలను నిలబెట్టే బసవతారకం వంటి ఆస్పత్రి పేరును ఇలా వాడటం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన మోసం మాత్రమే కాదు, ప్రజలకు సహాయం చేయాలనే మంచి ఉద్దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తుంది. నిస్వార్థ సేవకు మారుపేరైన బసవతారకం పేరును ఈ విధంగా దుర్వినియోగం చేయడం, ప్రజల దాతృత్వ స్వభావాన్ని వమ్ము చేస్తుంది.ఆస్పత్రి ట్రస్ట్ బోర్డుకు లేదా బాలకృష్ణకు ఎలాంటి సంబంధం లేని ఈ అశ్విన్ అట్లూరి, ఎందుకు, ఏ ప్రయోజనం కోసం ఈ మోసానికి పాల్పడుతున్నారన్నది తెలియాల్సి ఉంది.
