Just Andhra PradeshLatest News

108 ambulances: 108 అంబులెన్సులకు మేకోవర్ .. రంగుల రాజకీయాలకు బై బై..!

108 ambulances:108 అంబులెన్సులకు కొత్త వేషధారణ: కూటమి సర్కారు ‘రెస్క్యూ’ ఆపరేషన్ స్టార్ట్

108 ambulances

ఏపీలో అత్యవసర సేవలకు ప్రాణం పోసిన(108 ambulances) 108 అంబులెన్సులు ఇప్పుడు కొత్త ముస్తాబులో రోడ్డెక్కబోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో పొందిన నీలం వర్ణాన్ని తుడిచేసే ప్రయత్నం మొదలైంది. ఇకపై తెలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో దూసుకెళ్తున్న 108, 104 వాహనాలు పక్కనే ఉన్నా పట్టేలా ప్రత్యేకంగా డిజైన్ అవుతున్నాయి. రాత్రిపూట మెరిసే రెఫ్లెక్టివ్ టేపులు, అత్యాధునిక పరికరాలతో ఈ అంబులెన్సులు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి.

మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఈ పునరుద్ధరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కుశలవ్ కోచ్ కేంద్రంగా ఈ వాహనాలను కొత్త రూపానికి తీసుకొచ్చే పని జరుగుతోంది. అలాగే 104 వాహనాలను ‘సంజీవని’ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆ వాహనాలపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి సత్యకుమార్ ఫోటోలు కూడా ఉండనున్నాయి.

108 ambulances
108 ambulances

అయితే ఈ వెహికల్స్ (108 ambulances) కలర్ మార్చడం వెనుక రాజకీయ ప్రవాహమే ఉంది. ఒకప్పుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన 108 సేవలు ప్రజల జీవనరేఖగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత అంబులెన్సులకు వైసీపీ రంగుల రూపం ఇచ్చింది. వాహనాలపై పార్టీ రంగులు స్పష్టంగా కనిపించేవి. ఇది ప్రభుత్వ ఆస్తులపై పార్టీ ముద్ర వేయడమేనని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే రంగులను తొలగించి .. ప్రజాస్వామ్య దృక్పథంతో వాటిని పునర్ రూపకల్పన చేస్తోంది. ఇకపై పార్టీ ప్రయోజనాలు కాదు .. సేవలే ముఖ్యం అన్న మెసేజును ప్రజల్లోకి తీసుకుని వెళ్తుంది.

సాధారణంగా రాత్రిపూట లేదా అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కనిపించడం కష్టం. అయితే రెఫ్లెక్టివ్ టేపులతో అంబులెన్స్ ఎక్కడున్నా స్పష్టంగా కనిపిస్తుంది. మల్టీ కలర్ డిజైన్‌తో దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మార్పులతో పాటు రహదారి భద్రత కోసం రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అధిక వేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్లాన్ చేసింది. నెలాఖరు వరకూ ఒక్కో వారంలో ఒక్కో అంశంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఉంటుంది.

ఈ మార్పును కొందరు రాజకీయ రంగుల తొలగింపుగా చూస్తుంటే.. మరికొందరు ప్రజాసేవలో పారదర్శకత తీసుకొచ్చే చర్యగా అభివర్ణిస్తున్నారు. కానీ ఏమయినా సరే .. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండే 108(108 ambulances), 104 వాహనాలు మరింత సమర్థవంతంగా, క్లియర్‌గా కనిపించేలా రూపాన్ని మార్చడం ఒక సానుకూల మార్పుగానే చెప్పొచ్చు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button