Just SportsLatest News

IND vs NZ : సిరీస్ విజయమే టార్గెట్..కివీస్ తో రెండో వన్డేకు భారత్ రెడీ

IND vs NZ : భారత్ , న్యూజిలాండ్ రెండో వన్డేకు అంతా సిద్ధమయింది.రాజ్ కోట్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరగబోతోంది

IND vs NZ

భారత్ , న్యూజిలాండ్ (IND vs NZ) రెండో వన్డేకు అంతా సిద్ధమయింది.రాజ్ కోట్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరగబోతోంది. తొలి వన్డే గెలిచి జోరు మీదున్న టీమిండియా సిరీస్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ తప్పిస్తే కోహ్లీ , గిల్ , శ్రేయాస్ అయ్యర్ ఫామ్ లో ఉన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ దానికి తగ్గట్టే అదరగొడుతున్నాడు.

తన ఫామ్ పై ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ దుమ్ము రేపుతున్నాడు. ఆసీస్ టూర్ లో , తర్వాత సౌతాఫ్రికా సిరీస్ లో చెలరేగిపోయాడు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ లోనూ దానిని కంటిన్యూ చేస్తున్నాడు. తొలి వన్డేలో తృటిలో సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ ఇదే జోరు కొనసాగిస్తే కివీస్ కు కష్టాలు తప్పవు. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా…గిల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఇక రీ ఎంట్రీలో శ్రేయాస్ అయ్యర్ కూడా రాణించాడు.

హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కేఎల్ రాహుల్ , హర్షిత్ రాణా మ్యాచ్ ను ఫినిష్ చేసారు. అయితే రెండో వన్డేకు తుది జట్టులో రెండు మార్పులు జరగనున్నాయి. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ సిరీస్ కు దూరమయ్యాడు. రీప్లేస్ మెంట్ గా ఆయుష్ బదోనీ ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కే ఛాన్స్ ఉంది. అలాగే తొలి వన్డేలో మన బౌలర్లు అంతగా ప్రభావం చూపలేక పోయారు. మరీ ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ విఫలమయ్యాడు.

IND vs NZ
IND vs NZ

దీంతో అతన్ని తప్పించి అర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన కాంబినేషన్ ను మార్చే పరిస్థితి లేదు. అయితే సిరాజ్ కొత్త బంతితో మరింత ప్రభావం చూపాల్సి ఉంది. అతనితో పాటు స్పిన్నర్లు జడేజా , కుల్దీప్ యాదవ్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది.

మరోవైపు న్యూజిలాండ్ ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ లో బాగానే ఆకట్టుకుంది. భారత్ ను కంగారు పెట్టిందనే చెప్పాలి. ఆ జట్టు బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చారు. అలాగే మధ్య ఓవర్లలో తడబడినా చివర్లో పుంజుకుని భారీ స్కోర్ సాధించారు. దీంతో సిరీస్ సమం చేసే అవకాశం వారికీ ఉంది.

రాజ్ కోట్ పిచ్ సహజంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్ లు ఆడే అవకాశం ఉంది. అలాగే మంచు ప్రభావం ఉంటే మాత్రం చేజింగ్ జట్టుకు కలిసొచ్చే అంశం.

Ilayaraja:చిరు సినిమాకు ఇళయరాజా సెగ? సుందరి పాట వాడకంపై ఫ్యాన్స్ టెన్షన్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button