Just LifestyleHealthLatest News

yourself:మీరు అద్దంలో చూసుకుని మాట్లాడుకుంటారా? అయితే మీరు తెలివైనవారేనట.. ఎలా అంటే?

yourself: నేను ఇది చేయగలనని మనకు మనం చెప్పుకోవడం వల్ల మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలు తొలగిపోతాయి.

yourself

చాలా మంది అద్దం ముందు నిలబడి తమలో తాము(yourself) మాట్లాడుకుంటూ ఉండటం చూస్తూ ఉంటాం. బయట వ్యక్తులు చూస్తే ఇది పిచ్చితనం అనుకోవచ్చు కానీ, సైకాలజీ ప్రకారం ఇది ఒక గొప్ప మేధోపరమైన లక్షణమట. దీనిని ‘సెల్ఫ్-టాక్’ (Self-talk) అంటారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, మేధావులు కూడా ఈ పద్ధతినే పాటిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.

తనలో తాను మాట్లాడుకోవడం వల్ల మెదడు సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తుందట. ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు, దానిని గట్టిగా బయటకు చెబుతూ ..పరిష్కారం వెతకడం వల్ల మెదడుకు క్లారిటీ వస్తుంది. ఇది మన ఆలోచనలను క్రమబద్ధీకరించడానికి (Organizing thoughts) సహాయపడుతుందట.

అద్దంలో చూసుకుని మాట్లాడటం వల్ల మన బాడీ లాంగ్వేజ్ కూడా మనకు అర్థమవుతుంది, దీనివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయట. ఏదైనా ఇంటర్వ్యూ లేదా ప్రసంగానికి ముందు ఇలా చేయడం వల్ల భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చాలాసార్లు అందుకే వింటూ ఉంటాం.

yourself
yourself

అంతేకాకుండా, ఒత్తిడిలో ఉన్నప్పుడు మనల్ని మనం(yourself) ఓదార్చుకోవడానికి అలాగే ఉత్సాహపరుచుకోవడానికి కూడా సెల్ఫ్-టాక్ ఒక థెరపీలా పనిచేస్తుంది. నేను ఇది చేయగలనని మనకు మనం చెప్పుకోవడం వల్ల మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలు తొలగిపోతాయి.

నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉన్నప్పుడు, మన లోపలి గొంతుతో మనలో మనం చర్చించడం వల్ల సరైన మార్గం కనిపిస్తుంది. కాబట్టి, ఇకపై మీరు అద్దంలో చూసుకుని మాట్లాడుకోవడానికి సంకోచించకండి. ఎందుకంటే అది మిమ్మల్ని మరింత తెలివైన వారిగా మారుస్తుందని గుర్తుంచుకోండి.

Ilayaraja:చిరు సినిమాకు ఇళయరాజా సెగ? సుందరి పాట వాడకంపై ఫ్యాన్స్ టెన్షన్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button