Just Andhra PradeshLatest News

Kunki’s elephant: పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగులు పని మొదలెట్టేశాయ్..

Kunki's elephant: ఏపీ అడవుల్లో అడవి ఏనుగులు పంటలపై దాడులు చేస్తున్నా..అధికారులు నిశ్చేష్టంగా చూస్తున్నారంటూ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతంలో...

Kunki’s elephant

ఏపీ అడవుల్లో అడవి ఏనుగులు పంటలపై దాడులు చేస్తున్నా..అధికారులు నిశ్చేష్టంగా చూస్తున్నారంటూ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు చాలా మంది ఆ విమర్శలను పట్టించుకోలేదు. కొందరైతే “ఏనుగులపై పబ్లిక్ స్టేట్మెంట్లు అవసరమా?” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ… ఆ విమర్శలే ఇప్పుడు మార్పుకు దారితీశాయని, అప్పట్లో తక్కువ చేసిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారని తాజా సంఘటనలు చెబుతున్నాయి.

పవన్ చొరవతో..2024 అక్టోబర్‌లో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కి కృష్ణ, జయంత్, వినాయక్ అనే మూడు కుంకీ ఏనుగుల (Kunki’s elephant)ను తీసుకువచ్చారు. వీటికి అనుభవం ఉన్న మాస్టర్లు ఉన్నారు. ఫారెస్ట్ శాఖ ముందుగానే వీటిని టిరుపతి శివారులోని శ్రీ‌వేంకటేశ్వ‌ర జంతు ప్రదర్శనశాలలో కొన్ని నెలల పాటు వాసాన్నిచ్చి అటవీ వాతావరణానికి సన్నద్ధం చేసింది.

Kunki's elephant
Kunki’s elephant

చిత్తూరు, తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో గత కొంతకాలంగా అడవి ఏనుగుల దాడులు పెరిగాయి. రైతుల పంటలే కాదు, కొన్నిచోట్ల మనుషులపై దాడి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. పులిచెర్ల, పలమనేరు, మదనపల్లె, బంగారుపాలెం ప్రాంతాల్లో తరచూ ఏనుగులు దిగివస్తున్నాయి. దీనితో తక్షణ చర్యగా అడవి ఏనుగులపై నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కుంకీ ఏనుగుల కోసం ఏర్పాట్లు చేసింది. ఇవి వన్ విభాగం ఆధ్వర్యంలో నేరుగా పనిచేస్తున్నాయి.

చిత్తూరు జిల్లా పలమనేరు అడవుల్లో 8 అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసిన వేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ‘కృష్ణ’, ‘జయంత్’, ‘వినాయక్‌’ అనే శిక్షిత ఏనుగులు రంగంలోకి దిగి గుంపుని అడవిలోకి మళ్లించాయి. పంటల వైపు రాకుండా అవి చురుగ్గా వ్యవహరించడంతో.. ఈ ఆపరేషన్ (Kunki’s elephant) విజయవంతమైంది. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Annadatha Sukhibhava : అన్నదాతల ఖాతాల్లోకి రూ.7,000 జమ… కానీ కొందరికెందుకు రాలేదు?

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button