Just BusinessLatest News

Home loan:హోమ్ లోన్ తీసుకునేవారికి బిగ్ షాక్.. వడ్డీ రేట్ల పెంపుతో EMI భారం

Home loan:ఎస్‌బీఐ మాత్రమే కాదు, ఇతర బ్యాంకులు కూడా ఈ దారిలోనే నడుస్తుండటంతో, వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళన మొదలైంది.

Home loan

గృహ రుణాలు (Home Loans) తీసుకుని సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి ఎస్బీఐ ఊహించని షాక్ ఇచ్చింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను ఏకంగా 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాదు, ఇతర బ్యాంకులు కూడా ఈ దారిలోనే నడుస్తుండటంతో, వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళన మొదలైంది. అయితే, ఈ పెంపు కేవలం కొత్త లోన్లు తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే లోన్ ఉన్నవారికి ఎలాంటి మార్పు ఉండదని బ్యాంకులు స్పష్టం చేశాయి.

ప్రస్తుతం ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.50 శాతం నుంచి 8.70 శాతం వరకు పెరిగాయి. గతంలో ఇది 7.50 శాతం నుంచి 8.45 శాతంగా ఉండేది. ముఖ్యంగా, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి అధిక వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఎస్‌బీఐ పేర్కొంది. ఇదే బాటలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ హోమ్ లోన్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచి 7.45 శాతానికి చేర్చింది.

Home-loan
Home-loan

వడ్డీ పెంపు వెనుక కారణాలు ఏంటంటే..సాధారణంగా, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించే రెపో రేటు ఆధారంగా నిర్ణయిస్తాయి. అయితే, ఇటీవల కాలంలో రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇటీవల మార్కెట్లో రుణాలకు డిమాండ్ పెరగడం,బ్యాంకులు తమ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPA) రిస్క్‌ను తగ్గించుకోవడానికి అధిక వడ్డీ రేట్లను ఆశ్రయించాయి.అలాగే బ్యాంకుల ఫండింగ్ ఖర్చు పెరగడం కూడా ఒక కారణం.

ప్రస్తుతం హోమ్ లోన్(Home loan) వడ్డీ రేట్లను పరిశీలిస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులు (SBI, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్) స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచినా కూడా , అవి ఇంకా తక్కువ రేంజ్‌లోనే ఉన్నాయి. అయితే ప్రైవేటు బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి వాటిలో వడ్డీ రేట్లు వ్యక్తిగత క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఎక్కువగా మారుతున్నాయి.

Also Read: GST 2.0: జీఎస్టీ 2.0తో సామాన్యులకు భారం తగ్గుతుందా పెరుగుతుందా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button