Just BusinessLatest News

Gold :పెరిగిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ లక్షన్నర దాటిన తులం బంగారం

Gold : వచ్చే వారం నుంచే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో.. కొనుగోలుదారులు ఈ ధరల పెరుగుదల చూసి షాక్ అవుతున్నారు.

Gold

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి చేదు వార్త. మూడు రోజులుగా కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలకు మళ్లీ ఇప్పుడు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో దేశీయంగా పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వచ్చే వారం నుంచే దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో.. కొనుగోలుదారులు ఈ ధరల పెరుగుదల చూసి షాక్ అవుతున్నారు.

గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ (Gold )ధరలు అనూహ్యంగా పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారంపై ఏకంగా 98 డాలర్లు పెరిగిపోయింది. దీనితో ప్రస్తుతం అక్కడ ఔన్సు బంగారం ధర 4,966 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ప్రభావం డైరక్టుగా భారత్ దేశీయ మార్కెట్లపై పడింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఈరోజు అంటే ఫిబ్రవరి 8, 2026న ఉన్న  ధరలను ఒకసారి చూస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 మేర పెరిగి రూ. 1,43,550 కు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,56,600 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం(Gold) ధర రూ. 1,43,700 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 1,56,750 గా కొనసాగుతుంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,43,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,500 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Gold
Gold

బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా పైకి వెళ్తున్నాయి.తెలుగు రాష్ట్రాలయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి రూ. 2,85,000 కు చేరింది.ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ. 2,80,000 వద్ద ఉండగా, చెన్నైలో మాత్రం కిలో వెండి రూ. 2,85,000 వద్ద కొనసాగుతుంది.

అయితే న ధరలు ఆదివారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నవి మాత్రమే. స్థానిక జ్యువెలరీ షోరూమ్‌లలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటివి అదనంగా ఉంటాయి. మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి, కొనే ముందు ఒకసారి తాజా ధరలను తనిఖీ చేసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button