Just LifestyleLatest News

Valentine’s Day : వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకొంటారు? అసలు ఎవరీ వాలెంటైన్?

Valentine's Day : ప్రేమ జంటలు ఎంతో సరదాగా జరుపుకునే ఫిబ్రవరి 14 రోజు వెనుక ఒక గొప్ప త్యాగపూరితమైన ఓ మనిషి కథ ఉంది.

Valentine’s Day

కొద్ది రోజుల్లోనే వాలెంటైన్స్ డే(Valentine’s Day )రాబోతోంది. ప్రేమికులంతా ఆరోజు తమ మనసుకు నచ్చినవాళ్ల మనసు గెలుచుకోవడానికి రకరకాల ప్లాన్స్ ,ప్రిపరేషన్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రేమ జంటలు ఎంతో సరదాగా జరుపుకునే ఫిబ్రవరి 14 రోజు వెనుక ఒక గొప్ప త్యాగపూరితమైన ఓ మనిషి కథ ఉంది. నిజానికి ఈ పండుగ మూలాలు ప్రాచీన రోమ్ సామ్రాజ్యంలో ఉన్నాయి.

మూడో శతాబ్దంలో రోమ్‌ను క్లాడియస్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. అప్పట్లో సైనికులు పెళ్లి చేసుకుంటే వారి యుద్ధ నైపుణ్యం తగ్గుతుందని భావించిన క్లాడియస్ చక్రవర్తి, సైనికులెవరూ కూడా పెళ్లి చేసుకోకూడదని కఠినమైన ఆంక్షలు విధించాడు.

క్లాడియస్ పెట్టిన ఈ క్రూరమైన చట్టం వల్ల ఎంతో మంది ప్రేమికులు విడిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వాలెంటైన్ అనే ఒక క్రైస్తవ మత గురువు.. చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి మరీ, రహస్యంగా ప్రేమికులకు వివాహాలు చేసేవాడు.

ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి క్లాడియస్.. వాలెంటైన్‌కు(Valentine’s) మరణశిక్ష విధించాడు. అయితే జైలులో ఉన్న సమయంలో వాలెంటైన్ అక్కడి జైలర్ కుమార్తెతో స్నేహం చేశాడు. అయితే ఆమెకు అంధత్వం ఉండేదని..వాలెంటైన్ ప్రార్థనల వల్ల ఆమెకు చూపు కూడా వచ్చిందని చరిత్ర చెబుతుంది.

Valentine's Day
Valentine’s Day

వాలెంటైన్‌ను ఉరితీసే ముందు, ఆమెకు ఒక చిన్న లేఖ రాస్తూ దాని కింద ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని సంతకం చేశాడు. ఆయన ఫిబ్రవరి 14న మరణించాడని నమ్ముతారు.

అందుకే వాలెంటైన్‌ జ్ఞాపకార్థంతో పాటు ఆయన చేసిన త్యాగానికి గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరోజును వాలెంటైన్స్ డే (Valentine’s Day )అంటే ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు.

అప్పటి నుంచి ఆ లెటర్‌లో చేసిన సంతకం ఫ్రమ్ యువర్ వాలెంటైన్ .. ఒక ట్రెండ్‌గా మారి, ఇప్పటికీ ప్రేమికులు ఒకరినొకరు ‘వాలెంటైన్’ అని పిలుచుకుంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button