Just InternationalJust NationalJust PoliticalLatest News

PoK:భారత మ్యాప్‌లోనే పీఓకే, అక్సాయ్ చిన్..పాకిస్థాన్‌,చైనాకు ట్రంప్ షాక్..

PoK: అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం అఫీషియల్‌గా విడుదల చేసిన భారత మ్యాప్ చూసి.. పాకిస్థాన్, చైనాలు షాక్‌కు గురయ్యాయి.

PoK

అంతర్జాతీయ దౌత్య నీతిలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Interim Trade Agreement) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.

ఈ ఒప్పంద ప్రకటన సమయంలో అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం అఫీషియల్‌గా విడుదల చేసిన భారత మ్యాప్ చూసి.. పాకిస్థాన్, చైనాలు షాక్‌కు గురయ్యాయి. ఈ మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) , చైనా ఆధీనంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాలను కూడా భారత భూభాగంగానే చూపించింది. మొన్నటివరకూ పీవోకే(PoK), అక్సాయ్ చిన్న ప్రాంతాలను అమెరికా వివాదాస్పదంగా చూపించేది, కానీ ట్రంప్ హయాంలోనే ఈ మార్పు రావడం మోదీ దౌత్య విజయం అని చెప్పొచ్చు.

ఈ మ్యాప్ కేవలం గ్రాఫిక్ కాదు, అమెరికా విదేశాంగ నీతిలో వచ్చిన పెను మార్పుకు సంకేతంగా నిలిచింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) అనే గీత లేకుండా.. పూర్తి కాశ్మీర్ భారత దేశంలో భాగంగా చూపడం ద్వారా, అమెరికా మన సార్వభౌమాధికారానికి మద్దతు ప్రకటించింది. దీనిపై పాకిస్తాన్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, చైనా మాత్రం తన అలవాటు ప్రకారం అభ్యంతరాలు చెబుతోంది. అయితే, ట్రంప్ సర్కార్ భారత్‌తో స్నేహానికే మొగ్గు చూపిస్తోంది..

మరోవైపు అమెరికా విధించిన భారీ సుంకాలను తగ్గించడంతో.. ఇప్పుడు భారత వినియోగదారులకు నిజమైన పండుగ రాబోతోంది. ముఖ్యంగా మార్చి మధ్యలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగితే, మనం రోజూ వాడే ఎన్నో వస్తువుల ధరలు 10 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

అమెరికా నుంచి వచ్చే బాదం (Almonds), వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు బాగా తగ్గుతాయి. ఉదాహరణకు, హైదరాబాద్ సూపర్ మార్కెట్లలో కేజీ బాదం 1200 రూపాయలు ఉంటే, అది 900 రూపాయలకి తగ్గే అవకాశం ఉంది. కుకింగ్ ఆయిల్ (Soybean Oil) ధరలు కూడా లీటరుకు 50 రూపాయల వరకు తగ్గుతాయి.
అలాగే ఆపిల్ (Apple) ఉత్పత్తులతో పాటు ఇతర హై-టెక్ అమెరికన్ గ్యాడ్జెట్లపై సుంకాలు తగ్గడం వల్ల అవి 5 నుంచి 10 శాతం వరకూ చౌకగా దొరుకుతాయి.
వైన్, స్పిరిట్స్ వంటి ప్రీమియం డ్రింక్స్ ఇష్టపడే వారికి 50 నుంచి 70 శాతం వరకు ధరల ఉపశమనం కలగబోతోంది.

 

PoK
PoK

తెలుగు రాష్ట్రాలకు కలిగే ప్రత్యేక లాభాలు..
హైదరాబాద్‌ను ఐటీ ఫార్మా హబ్‌గా పిలుస్తాం. ఈ కొత్త ఒప్పందం భాగ్య నగరానికి వరం లాంటిది.

ఫార్మా రంగం.. డాక్టర్ రెడ్డీస్, హెటెరో వంటి దిగ్గజ ఫార్మా కంపెనీలన్నీ అమెరికా నుంచి తెచ్చుకునే యంత్రాలు (Machinery) , ముడి పదార్థాల కాస్ట్ తగ్గడంతో ఇక్కడ తయారయ్యే మందుల ధరలు కూడా తగ్గుతాయి.
ఐటీ రంగం.. డేటా సెంటర్లు, సెమీకండక్టర్ల తయారీకి కావాల్సిన హై-టెక్ ఎక్విప్‌మెంట్ చీప్‌గా దొరకడం వల్ల హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు కొత్త టెక్నాలజీలు , ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.
పౌల్ట్రీ మరియు డైరీ.. అమెరికా నుంచి వచ్చే జంతువుల మేత (Animal Feed) ధరలు తగ్గడం వల్ల మన దగ్గర కోడి మాంసం, గుడ్లు, పాలు ధరలు కూడా 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

ట్రంప్ పాలనలో భారత దేశానికి ప్రాధాన్యత పెరగడం, పాకిస్థాన్‌పై 19 శాతం టారిఫ్ విధించడం మనకు ఆర్థికంగా పెద్ద అడ్వాంటేజ్ కానుంది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, భారత రాజకీయ మ్యాప్‌కు అమెరికా ఇచ్చిన సమ్మతి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button