Just BusinessLatest News

Gold:ధనత్రయోదశి వేళ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజున పసిడి కొనడం తెలుగువారితో పాటు దేశవ్యాప్తంగా అనాదిగా వస్తున్న నమ్మకం. అయితే, ఈ శుభసమయంలోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

Gold

మరికొన్ని రోజుల్లో ధనత్రయోదశి, దీపావళి పండుగలు రానున్నాయి. ఈ పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేయడం ఐశ్వర్యం, శుభానికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజున పసిడి కొనడం తెలుగువారితో పాటు దేశవ్యాప్తంగా అనాదిగా వస్తున్న నమ్మకం. అయితే, ఈ శుభసమయంలోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పసిడి కొనాలనుకున్నవారికి, ఈ ధరల పెరుగుదల కొనుగోళ్లపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయ మార్కెట్‌లో ఈ రోజు (అక్టోబర్ 06, 2025) కూడా పసిడి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు (10 గ్రాములకు)
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
24 క్యారెట్ల (10 గ్రాములు) రూ.1,370 రూ.1,20,770
22 క్యారెట్ల (10 గ్రాములు) రూ.1,250 రూ.1,10,700

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,370 పెరిగి రూ.1,20,920 వద్ద స్థిరపడింది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,250 పెరుగుదలతో రూ.1,10,850కి చేరింది.

  • ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ధరలు తెలుగు రాష్ట్రాల ధరలనే అనుసరించాయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,370 పెరిగి రూ.1,20,770 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,250 పెరిగి రూ.1,10,700 వద్ద ఉంది.
  • బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు షాకిచ్చాయి. కిలో వెండి ధర ఈ రోజు ఉదయం రూ.1,000 చొప్పున పెరిగింది.
  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం -రూ.1,000 పెరిగి రూ.1,66,000 కి చేరింది.
    ఢిల్లీ, ముంబై – రూ.1,000 పెరిగి రూ.1,56,000 కి చేరింది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనేక అనిశ్చితుల వల్ల పసిడి ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రధానంగా..

Gold
Gold

గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్- ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల (Safe Haven Investments) వైపు మొగ్గు చూపుతారు, దీనివల్ల బంగారంపై డిమాండ్ పెరుగుతుంది.

అమెరికా వడ్డీ రేట్ల అనిశ్చితి- అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల గురించిన అనిశ్చితి కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతోంది.

కరెన్సీ మార్కెట్‌లో మార్పులు- డాలర్‌తో పోలిస్తే స్థానిక కరెన్సీ మార్కెట్‌లో జరిగే మార్పులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

బంగారం(Gold) కొనుగోలు చేసేటప్పుడు, మీరు చెల్లించే తుది ధరలో స్థానిక దుకాణాల్లో వసూలు చేసే మేకింగ్ ఛార్జీలు మరియు హాల్‌మార్క్ వివరాల ఆధారంగా మార్పులు ఉంటాయి. కాబట్టి, పసిడి కొనేముందు ఈ వివరాలన్నింటినీ తప్పకుండా సరిచూసుకోవాలి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button