Gold:స్టాక్ మార్కెట్‌ను దాటి దూసుకుపోతున్న బంగారం..రీజన్ తెలుసా?
Gold:కప్పుడు స్టాక్ మార్కెట్‌ల వైపు పరుగు తీసిన పెట్టుబడిదారులు ఇప్పుడు తమ సంపదను కాపాడుకోవడానికి ఈ బంగారం వైపు టర్న్ అయ్యారు.

Gold
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు తుఫానులో చిక్కుకున్న పడవల్లా ఊగిసలాడుతున్నప్పుడు, బంగారం మాత్రం తన స్థానంలో స్థిరంగా నిలబడి ఉంది. తరతరాలుగా తన విలువను నిలబెట్టుకుంటూ, ప్రతి సంక్షోభంలోనూ ఆశాకిరణంగా మారుతోంది. దీంతో ఒకప్పుడు స్టాక్ మార్కెట్(stock market)ల వైపు పరుగు తీసిన పెట్టుబడిదారులు ఇప్పుడు తమ సంపదను కాపాడుకోవడానికి ఈ బంగారం వైపు టర్న్ అయ్యారు.
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెంచురా సెక్యూరిటీస్ ప్రకారం, బంగారం(Gold) ధరలు ఇకపై తగ్గవని, మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. 2025 ద్వితీయార్థంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకి 3,600 డాలర్ల స్థాయికి చేరవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. ఇదివరకు రికార్డు స్థాయి అయిన 3,534.10 డాలర్లను బంగారం(Gold) ఇప్పటికే అధిగమించింది.

ఈ ధరాభారం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించడం, విధానాల అనిశ్చితి, పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు వంటివి ఈ ధరకు ఆజ్యం పోస్తున్నాయి. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం కూడా దీని పెరుగుదలకు ఒక ప్రధాన కారణంగా నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు, అమెరికా ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్టిన అనిశ్చితి, డీ-డాలరైజేషన్ ధోరణులు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
కొన్నేళ్లలోనే బంగారం పెట్టుబడిదారులకు నిఫ్టీ-50 కంటే అద్భుతమైన రాబడిని అందించింది. మూడు సంవత్సరాల్లో బంగారం సగటున 23% వార్షిక రాబడిని ఇవ్వగా, అదే సమయంలో నిఫ్టీ-50 కేవలం 11% మాత్రమే రాబడిని అందించింది. ఇక 2024లో, బంగారం ఇప్పటికే 27.23% పెరుగుదలను నమోదు చేయగా, నిఫ్టీ-50 కేవలం 8.8% రాబడితో వెనుకబడింది. ఈ గణాంకాలు పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక రిస్క్ తగ్గించే సాధనంగా చూడటానికి ప్రధాన కారణమయ్యాయి.
Home loan:హోమ్ లోన్ తీసుకునేవారికి బిగ్ షాక్.. వడ్డీ రేట్ల పెంపుతో EMI భారం
పెట్టుబడుల పరంగా బంగారం ధరలు దూసుకుపోతున్నా.. రిటైల్ మార్కెట్లో వినియోగం మాత్రం కొంత మందగమనంలో ఉందని హైదరాబాద్, ముంబైలోని బులియన్ డీలర్లు చెబుతున్నారు. వినియోగ ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పండుగలు, వివాహాల సీజన్‌లో కూడా రిటైల్ కొనుగోలు తగ్గుముఖం పట్టిందని వారు తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా తమ పెట్టుబడులకు సురక్షిత మార్గంగా భావించి, సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBలు), గోల్డ్ ETFలలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
బంగారం(Gold) ధరలు తగ్గితే కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్న పెట్టుబడిదారులు తమ వ్యూహాన్ని మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో బంగారంపై పెట్టుబడి పెట్టడం ఒక తెలివైన నిర్ణయమని నివేదికలు సూచిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
One Comment