Just BusinessLatest News

Gold rates: ఈరోజు తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్లు.. పసిడి ధరల పరుగుకు చిన్న బ్రేక్!

Gold rates: గోల్డ్ ప్రియులకు ఈరోజు కాస్త ఉపశమనం లభించినట్టుగా చెప్పొచ్చు.నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

Gold rates

భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో మహిళలకు బంగారం(Gold rates)తో ఉన్న అనుబంధం అపారం. ఇంట ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా, మహిళలు తప్పకుండా బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. లేటెస్ట్ డిజైన్లతో, లక్షల్లో విలువ చేసే చెవి కమ్మలు, నెక్లెస్లు, వడ్డాణాలు, గాజులు వంటి పసిడి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు.

సాధారణంగా ఆడవారికి షాపింగ్ విషయంలో ఎప్పుడూ బోర్ కొట్టదనే మాట ఉన్నా, బంగారం(Gold rates) షాపింగ్ విషయంలో ఆ ఉత్సాహం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే పసిడి ప్రియులు, ముఖ్యంగా మహిళలు, గోల్డ్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ధరలు కొంచెం తగ్గుముఖం పట్టగానే, బంగారం దుకాణాలు కిటకిటలాడడం తెలుగు రాష్ట్రాల్లో తరచూ కనిపించే దృశ్యమే.

అయితే, కొంతకాలంగా బంగారం ధరల (Gold rates)చుట్టూ అనిశ్చితి వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ, ఆర్థిక మార్కెట్ల ఒడిదుడుకుల కారణంగా పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక రోజు ధరలు తగ్గుతున్నాయంటే మహిళల్లో కొనుగోలు ఉత్సాహం పెరుగుతుంది, మరుసటి రోజు ఊహించని విధంగా ధరలు పెరిగితే నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో, కొద్దిపాటి తగ్గుదల కనిపించినా, ఆ వెంటనే డబుల్ లేదా ట్రిపుల్ స్థాయిలో ధరలు పెరగడం చూస్తున్నాము.

Gold rates
Gold rates

ఇలాంటి సమయంలో గోల్డ్ ప్రియులకు ఈరోజు కాస్త ఉపశమనం లభించినట్టుగా చెప్పొచ్చు. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధరలు (Gold rates)స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా, 22 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 1,19,600 ఉండగా, ఈరోజు రూ. 250 తగ్గి రూ. 1,19,350గా నమోదైంది. అదే విధంగా, అత్యంత స్వచ్ఛత గల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిన్న రూ. 1,30,480 వద్ద స్థిరంగా ఉండగా, ఈరోజు రూ. 280 తగ్గి రూ. 1,30,200కి చేరింది.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో నేటి ధరలను పరిశీలిస్తే, ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,350 (నిన్నటి ధర రూ. 1,19,600) గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,200 (నిన్నటి ధర రూ. 1,30,480) గాను ఉంది. సరిగ్గా అదే ధరలు విజయవాడ నగరంలో కూడా నమోదయ్యాయి. 22 క్యారెట్ల ధర రూ. 1,19,350 (నిన్నటి ధర రూ. 1,19,600) గా, 24 క్యారెట్ల ధర రూ. 1,30,200 (నిన్నటి ధర రూ. 1,30,480) గా కొనసాగుతోంది. ఈ స్వల్ప తగ్గుదల బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరటనిచ్చినట్లయింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button