Trading: ట్రేడింగ్ సైకాలజీ ..సక్సెస్ ఫుల్ ట్రేడర్‌గా మారడానికి ముఖ్య సూత్రాలు!
Trading : ట్రేడింగ్ అంటేనే రిస్కు, రివార్డు రెండూ ఉంటాయని చెబుతారు. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత, అనవసరపు భయాలకు తావు ఇవ్వకూడదు.

Trading
ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో, క్లిష్టతరమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్(Trading)ను మన చేతి వేళ్లపైకి తీసుకువచ్చింది. ఈ సౌలభ్యం కారణంగా ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన లేకున్నా, చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, సక్సెస్ ఫుల్ ఇన్వెస్టర్‌గా లేదా ట్రేడర్‌గా నిలవాలంటే, కేవలం మార్కెట్ నాలెడ్జ్ మాత్రమే కాదు, ట్రేడింగ్ సైకాలజీని అర్థం చేసుకోవడం అత్యంత అవసరం.
ట్రేడింగ్(Trading)అంటేనే రిస్కు, రివార్డు రెండూ ఉంటాయని చెబుతారు. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత, అనవసరపు భయాలకు తావు ఇవ్వకూడదు. భయం అనేది సర్వసాధారణంగానే ఉంటుంది, కానీ ట్రేడర్ దానికి ప్రతిస్పందించే విధానమే లాభాలను, నష్టాలను నిర్ణయిస్తుంది. నష్ట భయాలను అర్థం చేసుకుని, వాటిని నియంత్రించుకుని ట్రేడింగ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలి. అలాగే, అత్యాశ (Greed) వద్దు. ఒక రోజు లాభం పొందితే, ఆ విజయాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. అత్యాశతో నిరంతరం ట్రేడింగ్ చేస్తే, నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

కొన్నిసార్లు ట్రేడింగ్(Trading)లో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమాత్రం కుంగిపోకుండా, ఎక్కువ నష్టాలకు దారితీయకుండా సరైన విధానంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు ఈ రంగంలో కొనసాగాలంటే సానుకూల ఆలోచన విధానం అవసరం. ఏమాత్రం ఆశలు వదులుకోకుండా నిరంతరం మార్కెట్‌ను అధ్యయనం చేయాలి.
దీనికోసం ఎల్లప్పుడూ ఒక స్పష్టమైన ట్రేడింగ్ ప్లాన్తో ఉండాలి.ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలనేది పక్కాగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. దీని ద్వారా ట్రేడ్‌ను సుదీర్ఘ కాలంపాటు కొనసాగించగలుగుతారు. ఓవర్-ట్రేడ్ చేయకుండా జాగ్రత్త పడాలి.నష్టాలను విశ్లేషించడం నేర్చుకోవాలి. తప్పు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకుని ముందుకు సాగాలి.
తొలి దశలో ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన రాకపోవచ్చు. వీలైతే ఏదైనా షార్ట్ టర్మ్ ట్రైనింగ్ తీసుకోవాలి. దీంతో రానున్న రోజుల్లో ట్రేడింగ్ స్ట్రాటజీలను సమర్థవంతంగా అర్థం చేసుకోవచ్చు.