Moringa :సూపర్ డ్రింక్ మునగాకు టీ.. బరువు తగ్గడమే కాదు ఇంకా ఎన్నో ఉపయోగాలు..
Moringa :వ్యాయామంతో పాటు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక కప్పు మునగాకు టీ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గొచ్చు.
Moringa
చాలామంది పెరట్లోనే లభించే మునగాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప హెల్త్ డ్రింక్‌గా మారిపోయింది. గతంలో కేవలం కూరల్లోనే వాడుకున్న మునగాకును వాడేవారు. మహా అయితే మునగాకు పొడిగా తీసుకునే వారు. అయితే ఇప్పుడు మునగాకును టీ రూపంలో తీసుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. దీనిని మురింగా టీ అని కూడా పిలుస్తున్నారు.
సాధారణ గ్రీన్ టీ కంటే కూడా మునగాకు(Moringa ) టీలో పది రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి , రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప సహజ ఔషధంలా పనిచేస్తుంది.
మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు కరగడం మొదలవుతుంది. వ్యాయామంతో పాటు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక కప్పు మునగాకు టీ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గొచ్చు. ఇది కేవలం బరువు తగ్గించడమే కాకుండా, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపే డీటాక్స్ డ్రింక్‌లా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మధుమేహం లేదా డయాబెటిస్‌తో బాధపడేవారికి మునగాకు(Moringa ) టీ ఒక వరమనే చెప్పాలి. మునగాకులో ఉండే ‘ఐసోథియోసైనేట్స్’ అనే మూలకాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. భోజనం చేసిన తర్వాత వచ్చే సుగర్ స్పైక్స్‌ను మునగాకు అదుపు చేస్తుంది. రెగ్యులర్ గా ఈ టీని తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు రక్తపోటు (BP) సమస్య ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఈ మునగాకు టీని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎండిన మునగాకుల పొడిని గానీ లేదా పచ్చి మునగాకులను గానీ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వడకట్టుకుని అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకుని తాగాలి. అయితే గర్భిణీలు , కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని వాడితే మంచిది. మన భారతీయ సంప్రదాయంలో ఉన్న ఈ మునగాకు శక్తిని ప్రపంచం గుర్తిస్తున్న సమయంలో, మనం కూడా దీనిని మన జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ఎంతో అవసరం అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Bhogi Pandlu:లోగిళ్లలో భోగి సందడి.. చిన్నారులపై పోసే ఆ భోగి పండ్ల వెనుక ఉన్న అంతరార్థమిదే..




One Comment