Telangana:గర్భిణీగా ఉన్న భార్యను చంపి..ఆపై బాడీని ముక్కలు ముక్కలుగా చేసిన కిరాతకుడు
Telangana: తన భార్య నిండు గర్భిణి అని కూడా ఆలోచించకుండా, ఆమెను అత్యంత దారుణంగా చంపాడు.

Telangana
మేడ్చల్ జిల్లాలో జరిగిన ఆ దారుణ ఘటన ఒక హృదయాన్ని కలచివేసే ఘటన తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి..తన భార్యను అతికిరాతకంగా చంపిన ఘటన కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎంతగా దిగజారాయో, మానవ సంబంధాలు ఎంత దారుణంగా మారిపోతున్నాయో వరుస సంఘటనలు చూస్తే అర్థమవుతుంది.
ఈ విషాధకథలో వివరాలలోకి వెళ్తే.. డిగ్రీ చదువుకుంటున్న స్వాతికి, ర్యాపిడోలో పనిచేస్తున్న మహేందర్ రెడ్డికి మధ్య గతంలో ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకించినా లెక్కచేయకుండా ఒక్కటయ్యారు. మెల్లమెల్లగా వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.చివరకు స్వాతి గర్భవతిగా ఉన్న సమయంలో కూడా మహేందర్ రెడ్డి హింస ఆగలేదు.

కాలం గడిచే కొద్దీ మహేందర్ రెడ్డిలో ఉన్న రాక్షసుడు బయటపడి..తన భార్య నిండు గర్భిణి అని కూడా ఆలోచించకుండా, ఆమెను అత్యంత దారుణంగా చంపాడు. అయితే అక్కడితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, వాటిని పారేసి ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించాడు. ఈ సమయంలోనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు చిక్కాడు. అప్పటికే కొన్ని భాగాలు వివిధ ప్రాంతాలలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవల తెలంగాణలో, ప్రేమ వివాదాలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక, సామాజిక కారణాల వల్ల భార్య/భర్త హత్య కేసులు పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎక్కువగా కుటుంబంలో వివాహేతర సంబంధాలు, వాగ్వాదాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఒత్తిడి కారణాలుగా జరుగుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రేమ సంబంధ సమస్యల మీదే ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయని గుర్తు చేశారు.
Bigg Boss: టాప్ 15లోకి ఎంట్రీ..బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఎవరు కన్ఫర్మ్ అయ్యారు?
గత రెండేళ్లలో తెలంగాణలో భార్య హత్యలు, మహిళలపై నేరాల గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు చూస్తే..2022లో తెలంగాణలో 22,000కి పైగా మహిళలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భర్త లేదా అతని బంధువుల పీడించడం (9,996), మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం (4,652), కిడ్నాపింగ్, అత్యాచారం కేసులు ఎక్కువగా ఉన్నాయి.
రెండు సంవత్సరాల్లో, వివాహేతర సంబంధాలు, ప్రేమ వివాదాలు, కుటుంబ విభేదాల వలన హత్యలు , దారుణ ఘటనలు పెరుగుతున్నాయి.
2023లో తెలంగాణలో హత్యల కేసులుతో పాటు క్రైమ్ రేటు సుమారు 8.97% పెరిగింది.
మహిళల హత్య కేసుల్లో 2023 నుంచి 2024 వరకు పెరుగుదల 13.15%గా ఉంది. 2023లో 213 హత్యలు జరిగితే, 2024లో అవి 241కి పెరిగాయి. NCRB డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా కూడా భార్య హత్యలు ,భర్తల హత్యలు, కుటుంబ హింస కేసులు పెరుగుతూనే ఉన్నాయి.