Bigg Boss: టాప్ 15లోకి ఎంట్రీ..బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఎవరు కన్ఫర్మ్ అయ్యారు?
Bigg Boss:మొదటి రెండు ఎపిసోడ్లలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చూసిన తర్వాత, మూడో ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు వచ్చాయో చూద్దాం.

Bigg Boss
బిగ్ బాస్ (Bigg Boss)షోలో అగ్నిపరీక్ష పర్వం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. బిందు మాధవి, నవదీప్, అభిజిత్ ముగ్గురు జడ్జ్‌లు కామనర్స్‌ను ఎంపిక చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. లక్షల అప్లికేషన్ల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 45 మందిలో, కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేయడానికి ఈ అగ్నిపరీక్ష కొనసాగుతోంది. మొదటి రెండు ఎపిసోడ్లలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చూసిన తర్వాత, మూడో ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు వచ్చాయో చూద్దాం.
మొదటగా, విజయనగరం నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల .. నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్మీలో చేరి, ఇప్పుడు బిగ్ బాస్‌లో పాల్గొనాలనుకుంటున్నానని చెప్పాడు. అతని కథ విన్న జడ్జ్‌లు అతడిని హోల్డ్‌లో పెట్టారు. ఆ తర్వాత, హైదరాబాద్ నుంచి వచ్చిన అలేఖ్య.. కామన్ ఆడియన్స్‌లో క్లాస్ ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పింది. ఈమెను కూడా హోల్డ్‌లో ఉంచారు.
ఇక షాద్‌నగర్ నుంచి వచ్చిన షాకిబ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. డ్యాన్స్ వచ్చని చెప్పినా ఒక్క మూమెంట్ కూడా వేయలేకపోయాడు. అతను పూర్తిగా ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా (unerpected) నవదీప్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టాడు. ఇలాంటి వాళ్ళకి గ్రీన్ ఎందుకు ఇచ్చావ్? అని బిందు మాధవి నవదీప్‌ను ప్రశ్నించడం ఈ ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచింది.

డాల్య అనే ఫిట్నెస్ ట్రైనర్ తన కథతో జడ్జ్‌ల దృష్టిని ఆకర్షించింది. తనను కొంతమంది ఆకతాయిలు వేధిస్తే, ఐదు కిలోమీటర్లు రాత్రి పూట పరుగెత్తి, అప్పటి నుంచి బలంగా మారాలనుకున్నానని చెప్పింది. ఆమె ధైర్యానికి మెచ్చుకొని ఆమెను హోల్డ్‌లో పెట్టారు.
మరోవైపు, సిద్దిపేట నుంచి వచ్చిన మోడల్ వెంకటేష్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. నీకు బిగ్ బాస్ సెట్ కాదని జడ్జ్‌లు తేల్చి చెప్పి అతడిని ఎలిమినేట్ చేశారు. వరంగల్ నుంచి వచ్చిన కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లూయెన్సర్ అయిన అనూష కథ మాత్రం భిన్నంగా ఉంది. ఆమె ధైర్యం, తన కుటుంబాన్ని పోషించే విధానం జడ్జ్‌లను ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెను టాప్ 15లోకి సెలెక్ట్ చేశారు.
అనకాపల్లి నుంచి వచ్చిన సాయి కృష్ణ తన తండ్రిని గర్వపడేలా చేయాలని వచ్చానని చెప్పాడు. ఇతడిని కూడా హోల్డ్‌లో ఉంచారు. కడప నుంచి వచ్చిన డెంటిస్ట్ నిఖిత తన వృత్తిని బలవంతంగా ఎంచుకున్నానని, బిగ్ బాస్‌లోకి రావాలని ఉందని చెప్పింది.
They’ve faced life’s toughest Agnipariksha… now they step into the fire again 🔥
Will the Grand Masters let emotions rule the test? Watch Bigg Boss Agnipariksha only on JioHotstar! 💫#BiggbossTelugu9 #Biggboss9Agnipariksha #StreamingNow #JioHotstar #JioHotstarTelugu pic.twitter.com/sVITCrsAvO
— Starmaa (@StarMaa) August 23, 2025
అభిజిత్ ఆమెకు బిగ్ బాస్ (Bigg Boss)సరిపోదని చెప్పినా, బిందు, నవదీప్ ఒక ఛాన్స్ ఇద్దామని హోల్డ్‌లో పెట్టారు. విజయవాడ నుంచి వచ్చిన 19 ఏళ్ల జనీత్ తాను వ్యాపారవేత్త అవ్వాలనుకుంటున్నానని, తల్లి కష్టాలను చూసి వచ్చానని చెప్పాడు. అయితే, ఇప్పుడే బిగ్ బాస్ వద్దని ముగ్గురు జడ్జ్‌లు కలిసి అతడిని వెనక్కి పంపారు.
ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికరమైన ఎంట్రీ శ్వేతది. యూకేలో ఉంటున్న ఈమె.. బిజినెస్ అనలిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్, మోడల్ అని పరిచయం చేసుకుంది. తాను ‘ఆడ నవదీప్’ అని చెప్పడం, అంతేకాకుండా నవదీప్‌కు ప్రపోజ్ చేసే టాస్క్‌తో అందరినీ ఆకట్టుకోవడం ఈ ఎపిసోడ్లో ఫన్ ఎలిమెంట్స్. ఆమె పర్ఫార్మెన్స్కు ముగ్గురు జడ్జ్‌లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాప్ 15లోకి సెలెక్ట్ చేశారు.
మూడు ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత, శ్రీముఖి అగ్నిపరీక్ష(Bigg Boss Agnipariksha) ఆడిషన్ ముగిసిందని ప్రకటించింది. ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే కన్ఫర్మ్ అయ్యారని, 16 మంది హోల్డ్‌లో ఉన్నారని తెలిపింది. ఈ 16 మందిలో నుంచి ఇంకా 9 మందిని సెలెక్ట్ చేయాల్సి ఉందని, అసలు సిసలైన అగ్నిపరీక్ష ఇప్పుడు మొదలు కానుందని వెల్లడించింది. మరి రానున్న రోజుల్లో హోల్డ్‌లో ఉన్న వారిలో ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి.
One Comment