Yoga teacher: యోగా టీచర్ ముసుగులో అరాచకం.. గర్భవతి అయిన యువతి
Yoga teacher: తనతో పాటు ఇంకో ఆరుగురు అమ్మాయిలు కూడా ఇలాగే వేధింపులకి గురయ్యారని, వారి పేర్లు కూడా ఇస్తానని ఆ అమ్మాయి చెప్పింది.

Yoga teacher
నేటి యంగ్ జనరేషన్ తమ కలలని రియలైజ్ చేసుకోవడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి, ట్రైనింగ్ సెంటర్స్‌కి వెళ్తున్నారు. పేరెంట్స్ కూడా తమ పిల్లల ఫ్యూచర్ కోసం లక్షల డబ్బు ఖర్చు పెట్టి నమ్మకంతో పంపిస్తున్నారు. కానీ, ఇలాంటి సంస్థల్లోనే సేఫ్టీ ఉండని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక సంఘటన ఇలాంటి భయాలను మరింత పెంచుతోంది.
తన యోగా టీచర్ (Yoga teacher)తనపై అత్యాచారం, సెక్సువల్ హెరాస్‌మెంట్ చేశాడన్న ఆరోపణలతో 19 ఏళ్ల యోగా ప్రాక్టీషనర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఆ టీచర్(Yoga teacher) తనకే ఓ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అతడు ఆ అమ్మాయికి నేషనల్ మెడల్, మంచి ప్లేస్‌మెంట్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసి లైంగిక వేధింపులకి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది.
ఈ ఇన్సిడెంట్ ఆగస్టు 30న వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేసి, నిందితుడి కోసం వెతుకుతున్నారు. ఆ అమ్మాయికి 2019 నుంచి ఆ టీచర్ తెలుసు. 2023లో, 17 ఏళ్ల వయసులో ఆమె ఆ టీచర్‌తో కలిసి థాయిలాండ్‌లో ఒక యోగా ఈవెంట్‌కి వెళ్లింది. అక్కడ కూడా అతను ఆమెను సెక్సువల్లీ హెరాస్ చేశాడని, దానితో ఆమె ఈవెంట్‌ని మధ్యలోనే వదిలేసి వచ్చిందని తన కంప్లైంట్‌లో చెప్పింది.

2024లో, ఆమె అదే టీచర్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యింది. మళ్లీ అతను నేషనల్ మెడల్, మంచి జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను వేధించాడు. ఈ టార్చర్ ఆగస్టు 22 వరకు కూడా కొనసాగిందని ఆమె తెలిపింది. ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ విషయం బయటపడింది. ఆమె తన పేరెంట్స్‌కి కూడా ఈ విషయాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. తనతో పాటు ఇంకో ఆరుగురు అమ్మాయిలు కూడా ఇలాగే వేధింపులకి గురయ్యారని, వారి పేర్లు కూడా ఇస్తానని ఆ అమ్మాయి చెప్పింది.
నిజంగా, మన సొసైటీలో పేరెంట్స్ నమ్మకంతో పంపే ప్రతి సంస్థ కూడా భద్రత ఇవ్వలేదన్న న భయం కలుగుతోంది. ఫేమస్ ఇన్‌స్టిట్యూట్స్, నమ్మకస్తులైన టీచర్ల ముసుగులో ఇలాంటి దుర్మార్గాలు జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, పేరెంట్స్, ప్రభుత్వం, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి.