Just EntertainmentLatest News

Actress Pragati:పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌గా నటి ప్రగతి..ట్రోలర్లకు సింగర్ చిన్మయి కౌంటర్

Actress Pragati: తాను ప్యాషన్‌గా ఎంచుకున్న పవర్ లిఫ్టింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రగతి పతకాల వర్షం కురిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Actress Pragati

టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో సినిమాలలో అమ్మగా, అత్తగా, వదినగా సుపరిచితురాలైన సీనియర్ నటి ప్రగతి సినిమాలకు తాత్కాలికంగా దూరమై తన వ్యక్తిగత లక్ష్యాన్ని చేరుకోవడంలో అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాను ప్యాషన్‌గా ఎంచుకున్న పవర్ లిఫ్టింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆమె పతకాల వర్షం కురిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

టర్కీలో నాలుగు పతకాలు.. ప్రగతి(Actress Pragati) ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025 లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలను గెలుచుకున్నారు. ఆమె తన విభాగంలో ఒక బంగారు పతకాన్ని సాధించారు. దీనితో పాటు మరో మూడు రజత పతకాలను కూడా ఖాతాలో వేసుకున్నారు.

Actress Pragati
Actress Pragati

సాధారణంగా నటీనటులు గ్లామర్ ప్రపంచంలో ఉండిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, ప్రగతి మాత్రం తన ఫిట్‌నెస్, స్ట్రెంత్ పట్ల ఉన్న అంకితభావాన్ని ఈ అంతర్జాతీయ విజయం ద్వారా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

ట్రోలింగ్‌పై చిన్మయి స్ట్రాంగ్ రియాక్షన్.. ప్రగతి(Actress Pragati) ఈ స్థాయి విజయాన్ని సాధించినా, గతంలో ఆమె తన పవర్ లిఫ్టింగ్, జిమ్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నప్పుడు తీవ్రమైన ట్రోలింగ్ విమర్శలను ఎదుర్కొన్నారు. వయసు మళ్లిన తర్వాత జిమ్ ఫొటోలు ఎందుకని, అసభ్యకరమైన కామెంట్లు పెట్టి కొందరు నెగిటివిటీని వ్యాప్తి చేశారు.

అయితే ఈ సమయంలో ఆమె విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఒక నెటిజన్ చేసిన పోస్ట్‌కు సింగర్ చిన్మయి శ్రీపాద ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.

ప్రగతి(Actress Pragati) గారి ఫొటోల గురించి అసభ్యకరమైన కామెంట్లు పెట్టినవారు వాళ్ల జీవితంలో ఏం సాధించారు? అలాంటివారు ఎప్పటికీ ఏమి సాధించలేరు” అని చిన్మయి ప్రశ్నించారు.

Actress Pragati
Actress Pragati

మహిళలకు స్ఫూర్తి: యువత, ముఖ్యంగా అమ్మాయిలు ప్రగతి గారి నుంచి స్ఫూర్తి పొంది, తమ లక్ష్యాల వైపు ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.

తనపై వచ్చే చెడు కామెంట్లను పట్టించుకోకుండా పక్కన పెట్టేయాలని, అలాగే “మీరు భవిష్యత్తులో ఇలాంటివారి కుటుంబంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడండి” అని యువతులకు ఒక కీలకమైన సామాజిక సలహా ఇచ్చారు.

సాధారణంగా మహిళలు తమ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఎదుర్కొనే సామాజిక విమర్శలు, ట్రోలింగ్‌లకు వ్యతిరేకంగా చిన్మయి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. విమర్శలను పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని చేరుకున్న నటి ప్రగతి, మహిళలందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button