Liver:మందు తాగకపోయినా లివర్ పాడవుతుందా? ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
Liver: మద్యం ముట్టని వారిలో కూడా ఫ్యాటీ లివర్ పేరుకుపోవడం అనే సమస్య విపరీతంగా పెరుగుతోంది.
Liver
లివర్ పాడైందని ఎవరైనా అంటే వారు మద్యం తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మద్యం ముట్టని వారిలో కూడా ఫ్యాటీ లివర్ (Liver) పేరుకుపోవడం అనే సమస్య విపరీతంగా పెరుగుతోంది. దీనినే వైద్య పరిభాషలో ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ (NAFLD) అంటారు. ఇది ప్రాణాంతకమైన లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌కు కూడా దారితీయొచ్చు.
మద్యం తాగని వారిలో ఫ్యాటీ లివర్(Liver) రావడానికి కారణాలేంటి?
అధిక బరువు (Obesity).. శరీర బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా చేరడం వల్ల కాలేయంపై ఒత్తిడి పడి కొవ్వు పేరుకుపోతుంది.
టైప్-2 డయాబెటిస్.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి లివర్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.
జంక్ ఫుడ్ , సాఫ్ట్ డ్రింక్స్.. మైదా, చక్కెర, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే పానీయాలు తాగడం వల్ల లివర్ లో కొవ్వు త్వరగా పెరుగుతుంది.
అధిక కొలెస్ట్రాల్..రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువగా ఉండటం కూడా ఒక మెయిన్ రీజన్ .
ఫ్యాటీ లివర్ అనేది స్టార్టింగ్ దశలో ఎటువంటి నొప్పులను కలిగించదు. కానీ ఈ క్రింది లక్షణాలను మాత్రం గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
తీవ్రమైన అలసట-ఏ పని చేయకపోయినా ఎప్పుడూ నీరసంగా అనిపించడం.
పొట్ట పైభాగంలో అసౌకర్యం- కుడి వైపు పొట్ట పైభాగంలో మొద్దుబారినట్లు లేదా భారంగా అనిపించడం.
కళ్లు , చర్మం- కంటి తెల్లసొన పసుపు రంగులోకి మారడం (లైట్ జాండీస్).
ఆకలి మందగించడం- ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, వికారం వంటివి.

మందులు వాడటం కంటే లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ ను 100% నయం చేసుకోవచ్చు.
బరువు తగ్గడం- మీ శరీర బరువులో కనీసం 7-10% తగ్గినా లివర్ లో కొవ్వు కరగడం మొదలవుతుంది.
మెడిటరేనియన్ డైట్- ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (చేపలు, నట్స్) ఎక్కువగా తీసుకోవాలి.
వ్యాయామం- రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం (Brisk Walking) లేదా యోగా చేయడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది.
చక్కెరను దూరం పెట్టాలి- స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్, సోడా వంటి వాటిని పూర్తిగా మానేయాలి.
లివర్ డిటాక్స్- రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం, వెల్లుల్లి, గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.
లివర్(Liver) అనేది శరీరంలోని ల్యాబొరేటరీ లాంటిది. అది ఆరోగ్యంగా ఉంటేనే మనిషికి శక్తి లభిస్తుంది. కాబట్టి మద్యం అలవాటు లేకపోయినా, పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఒక ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’ (LFT) చేయించుకోవడం మంచిది.
T20 : దంచికొట్టిన ఇషాన్, సూర్యాభాయ్..రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం



