Business:టాప్ బిజినెస్ ఐడియా.. తక్కువ పెట్టుబడితో ఎలా మొదలెట్టాలంటే?
Business: మొక్కల నుంచి తీసిన పిండి పదార్థాలు , పేపర్, లేదా బయో-డిగ్రేడబుల్ మెటీరియల్స్ తో చేసే ప్యాకేజింగ్ వస్తువులు కేవలం కొద్ది నెలల్లోనే భూమిలో కలిసిపోతాయి.
Business
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారిందన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకంపై పెద్ద ఎత్తున కఠినమైన నిబంధనలను విధిస్తున్నాయి.
దీనికి చెక్ పెట్టేలా ఇప్పుడు ఎకో-ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ (పర్యావరణ హిత ప్యాకేజింగ్) రంగం ఒక అద్భుతమైన వ్యాపార (Business) అవకాశంగా అవతరిస్తోంది. 2026 నాటికి ఈ బిజినెస్ కొన్ని వేల కోట్ల మార్కెట్ ను ఇది సొంతం చేసుకోబోతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎకో-ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అంటే ఏంటంటే..సాధారణంగా మనం వాడుతున్న ప్లాస్టిక్ కవర్లు, బాక్సులు భూమిలో పూర్తిగా కలవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుందట. కానీ మొక్కల నుంచి తీసిన పిండి పదార్థాలు (Corn Starch), పేపర్, లేదా బయో-డిగ్రేడబుల్ మెటీరియల్స్ తో చేసే ప్యాకేజింగ్ వస్తువులు కేవలం కొద్ది నెలల్లోనే భూమిలో కలిసిపోతాయి. వీటినే ఎకో-ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అంటారు.

ఈ బిజినెస్‌లో చాలా అవకాశాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే..
బయో-డిగ్రేడబుల్ కవర్లు- కూరగాయల షాపుల నుంచి బట్టల షోరూమ్స్ వరకు అందరికీ ఇవి అవసరం.
పేపర్ కప్పులు , స్ట్రాలు- ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధం వల్ల వీటికి భారీ డిమాండ్ ఉంది.
ఈ-కామర్స్ బాక్సులు- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇప్పుడు ప్లాస్టిక్ టేపులకు బదులు పేపర్ టేపులను, బాక్సులు వాడుతున్నాయి.
తక్కువ పెట్టుబడితో చిన్న మిషన్ల ద్వారా ఇంటి నుంచే ఈ బిజినెస్ ప్రారంభించొచ్చు. దీనికి పర్యావరణ హిత వ్యాపారం కాబట్టి బ్యాంకుల నుంచి లోన్లు, సబ్సిడీలు కూడా ఈజీగా లభిస్తాయి. భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గిపోతుంది కనుక, ఇప్పుడే ఈ రంగంలోకి అడుగుపెడితే మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
T20 : దంచికొట్టిన ఇషాన్, సూర్యాభాయ్..రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం



