Just EntertainmentLatest News

Akhanda 2 Release Date: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

Akhanda 2 Release Date: అఖండ 2 చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, సంయుక్త హీరోయిన్‌గా నటించింది.

Akhanda 2 Release Date

నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2′ విడుదల(Akhanda 2 Release Date)పై అభిమానుల్లో నెలకొన్న ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. ఇప్పటికే కొన్ని సార్లు వాయిదా పడిన ఈ చిత్రం, డిసెంబర్ 5న రావాల్సి ఉన్నా, అనుకోని ఆర్థిక వివాదం కారణంగా నిలిచిపోయింది. అయితే, తాజాగా కోర్టు కేసు క్లియర్ కావడంతో, చిత్ర నిర్మాణ సంస్థ అభిమానులకు అతిపెద్ద శుభవార్తను అందించడానికి సిద్ధమయింది.’అఖండ 2’ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల(Akhanda 2 Release Date) కానుంది.

‘అఖండ 2(Akhanda 2 Release Date)’ సినిమాను నిర్మించిన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ కారణంగానే రిలీజ్‌కు ఓకే చెప్పింది. గతంలో 14 రీల్స్ భాగస్వాములతో కలిసి ఈరోస్ సంస్థ నిర్మించిన ‘వన్ నేనొక్కడినే’, ‘ఆగడు’ చిత్రాల నష్టాలకు సంబంధించిన రూ. 28 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వివాదానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిర్మాతలు వేగంగానే కాదు దాదాపుగా పరిష్కరించారు.

Akhanda 2 Release Date
Akhanda 2 Release Date

ఈ చిత్ర బృందం డిసెంబర్ 12న రిలీజ్ కోసం ఏర్పాట్లు చేసుకుంది. అంతేకాకుండా, అభిమానుల కోసం ఒక రోజు ముందుగానే, అంటే డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు పలుచోట్ల ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు

ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, సంయుక్త హీరోయిన్‌గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.

బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద విజయం గ్యారెంటీ. వీరి మునుపటి చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ భారీ హిట్స్ కావడంతో, ‘అఖండ 2’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్‌లకు వచ్చిన అద్భుతమైన స్పందన, ఈ సినిమా కూడా గత చిత్రాల రికార్డులను తిరగరాస్తుందని బలంగా సూచిస్తున్నాయి.

ఈ భారీ చిత్రం విడుదలపై ఉన్న సందిగ్ధత తొలగిపోవడంతో, డిసెంబర్ 12న రావడానికి సిద్ధపడిన చిన్న చిత్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమా వస్తుందని ఖరారు కావడంతో, ఆ చిన్న సినిమాలలో కొన్ని వేరే తేదీలకు మారే అవకాశం ఉంది.

మొత్తంగా, ఫైనాన్షియల్ వివాదాలు పక్కకు తొలగి, సినిమా విడుదల తేదీ ఖరారైందనే వార్త నందమూరి అభిమానులకు నిజమైన పండుగ లాంటిది. డిసెంబర్ 12న బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయం అని సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button