Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ..దివ్య కౌంటర్‌తో మాధురి ఆవేశం, భరణి ఫైర్
Bigg Boss: మొన్నటి ఎపిసోడ్లో దువ్వాడ మాధురి, కళ్యాణ్‌ల మధ్య చిన్న విషయానికే పెద్ద గొడవ జరగగా, తాజాగా నామినేషన్స్ ప్రక్రియలో భరణి, దివ్య కాంట్రవర్శీలో చిక్కుకున్నారు.

Bigg Boss
బిగ్ బాస్ (Bigg Boss)తెలుగు సీజన్ 9లో కొత్త కంటెస్టెంట్ల రాకతో రచ్చ రచ్చ మొదలైంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పాత కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తూ, నామినేషన్లలో తీవ్ర వాదనలకు దిగుతున్నారు. మొన్నటి ఎపిసోడ్లో దువ్వాడ మాధురి, కళ్యాణ్‌ల మధ్య చిన్న విషయానికే పెద్ద గొడవ జరగగా, తాజాగా నామినేషన్స్ ప్రక్రియలో భరణి, దివ్య కాంట్రవర్శీలో చిక్కుకున్నారు.
నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్(Bigg Boss) నామినేషన్స్ ప్రక్రియ కోసం ఒక బాల్‌ను హౌస్‌లోకి వదలగా, కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ దాని కోసం పోటీపడ్డారు. చివరికి ఆ బంతి దువ్వాడ మాధురి చేతికి వచ్చింది. మాధురి ఆ బంతిని రీతూకు ఇవ్వడంతో, రీతూ భరణిని నామినేట్ చేసింది.
రీతూ, భరణిని నామినేట్ చేస్తూ ..మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నాకు సపోర్ట్ చేయలేదంటూ రెచ్చిపోయింది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్‌లో సహాయం చేస్తానని మాట ఇచ్చి కూడా చేయకపోవడం వల్లే తన కెప్టెన్సీ పోయిందని రీతూ ఆరోపించింది. దీనికి భరణి సమాధానమిస్తూ, నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు. ఇంకొంతమందికి కూడా మాట ఇచ్చా. నువ్వు, రాము ఉన్నప్పుడు నేను రాముకే హెల్ప్ చేస్తానని చెప్పానని తన పక్షాన గట్టిగా వివరణ ఇచ్చాడు.

ఆ తరువాత, రీతూ రెండో నామినేషన్‌ను దివ్యకు వేసింది. రీతూ చెప్పిన కారణం చాలా చిన్నది.. టిఫిన్ టైమ్‌కి దొరకలేదు, నాకు చాలా ఇబ్బంది అయింది, నీరసం వచ్చి కళ్లు తిరిగాయ్. నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి, నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయింది అంటూ రీతూ దివ్యను నామినేట్ చేసింది. దానికి దివ్య ..దోస కోసం నన్ను నువ్వు నామినేట్ చేస్తున్నావా? అని అడగగా, రీతూ అది నాకు పెద్ద విషయం అంటూ బదులిచ్చింది.
ఈ రెండు నామినేషన్స్‌లో, మాధురి ఒకరిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాల్సి వచ్చింది. మాధురి, భరణిని సేవ్ చేసి, దివ్యను నామినేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా మాధురి దివ్యతో మాట్లాడుతూ, మేము కొత్తగా వచ్చాము, మీరు మాకు కోఆపరేట్ చేయాలి, మా మీద అరవకూడదు” అని చెప్పింది.
అలాగే, మీరు ఎంతసేపూ భరణిగారితో తప్ప ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వలేదని మాధురి అన్నది. దీనికి దివ్య నాకు మీతో అవ్వాలని కూడా లేదని ముఖం మీదే చెప్పేసింది. దివ్య ఆటిట్యూడ్‌తో మరింత రెచ్చిపోయిన మాధురి..సరే మీ ఇష్టం, నేను చెప్తున్నాను, మీ ఆన్సర్ నేను అడగలేదు కదా… ఇదిగో ఈ ఆటిట్యూడ్ కారణంగానే నామినేట్ చేస్తున్నానంటూ కోపంగా వెళ్లి కూర్చుంది.
ఈ నామినేషన్ గొడవ తర్వాత, దివ్య, రాము, భరణి ఒకచోట కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా భరణి తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఇలా తయారేంటి అందరూ… సైకోలు ఉంటారు చూడు… చెప్తా… నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలకి తెలిసే టైమ్ వచ్చింది రాము… కొడతాను చూడరా ఇక్కడి నుంచి ఒక్కొక్కడినీ… నువ్వు ఏం మాట్లాడకు సినిమా చూస్తూ ఉండు… పిక్చర్ చూస్తూ ఉండు అంతే…” అంటూ భరణి రగిలిపోయాడు. వైల్డ్ కార్డుల దూకుడు, పాత కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధంతో బిగ్ బాస్ హౌస్(Bigg Boss) మరింత వేడెక్కింది.
One Comment