Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9.. పవన్ (డీమాన్) కు నాగార్జున సీరియస్ క్లాస్..
Bigg Boss: నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే శుక్రవారం నాటి ఎపిసోడ్ హైలైట్స్ చూపించారు. ఆ తర్వాత ఒక్కొక్కరి ఫోటో ఫ్రేమ్‌కు కత్తిని గుచ్చుతూ క్లాస్ మొదలుపెట్టారు.
Bigg Boss
బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో క్లాస్ పీకారు. శుక్రవారం జరిగిన గొడవలు, హౌస్‌మేట్స్ ప్రవర్తనపై కత్తి దూసి మరీ నిలదీశారు. ముఖ్యంగా, పవన్ (డీమాన్) రీతూ పట్ల ప్రవర్తించిన తీరుపై నాగార్జున తీవ్రంగా మండిపడ్డారు.
కింగ్ నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే శుక్రవారం నాటి ఎపిసోడ్ హైలైట్స్ చూపించారు. బిర్యానీ విషయంలో భరణి, మాధురి మధ్య జరిగిన గొడవ, అందులో దివ్య జోక్యంపై చర్చ జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరి ఫోటో ఫ్రేమ్‌కు కత్తిని గుచ్చుతూ క్లాస్ మొదలుపెట్టారు.
సంజన: నామినేషన్లలోకి రాగానే కంట్రోల్ తప్పి నోరు జారడంపై హెచ్చరించారు.
మాధురి: స్నేహంలో తప్పులు వెతకడం, ‘షటప్’ లాంటి పదాలు వాడటం ఎంతవరకు కరెక్ట్ అని సున్నితంగా ప్రశ్నించారు.
దివ్య: భరణి, మాధురి గొడవలో వకాల్తా పుచ్చుకుని వెళ్లడం ఎందుకని కౌంటర్ ఇచ్చారు. తనుజ, కళ్యాణ్ గొడవకు కారణం ఇమ్మాన్యుయేల్ అని చెప్పడంపై కూడా ప్రశ్నించారు.

అయితే, ఎపిసోడ్‌లోనే అత్యంత కీలక ఘట్టం పవన్ (డీమాన్) ప్రవర్తనపై నాగార్జున రియాక్షన్. కోపంతో పవన్, రీతూను బెడ్‌పైకి తోసేసిన వీడియోను చూపించి నాగార్జున ఉగ్రరూపం దాల్చారు.
“ఆడపిల్లపై ‘మ్యాన్ హ్యాండ్లింగ్’ చేయడం తప్పు! కోపంలో అయినా, ఆవేశంలో అయినా ఇలా ప్రవర్తించడం సరికాదు. బ్యాగ్ సర్దుకో! డోర్స్ ఓపెన్ చేయండి!” అంటూ తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు.
పవన్ తరఫున రీతూ ఎంత సమర్థించడానికి ప్రయత్నించినా, “నీకు ఇద్దరి మధ్య బాండింగ్ తప్పో కాదో చెప్పే హక్కు లేదు. ఇది కేవలం మీ ఇద్దరి విషయమే కాదు, షో పరువుకు సంబంధించిన విషయం. ఇది రిపీట్ అయితే, ఫ్యూచర్ సీజన్స్ కంటెస్టెంట్స్‌కు తప్పుడు సంకేతం వెళ్తుంది,” అని నాగార్జున గట్టిగా చెప్పారు.
నాగార్జున బ్రేక్ తీసుకున్న సమయంలో, రీతూ డీమాన్‌ను సముదాయించింది. తిరిగి వచ్చాక, డీమాన్ పవన్ చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. హౌస్‌మేట్స్ అందరూ పవన్‌కు సపోర్ట్ చేశారు.
చివరికి, డీమాన్ పవన్‌ను మోకాళ్లపై కూర్చొని రీతూకు క్షమాపణలు చెప్పాల్సిందిగా నాగార్జున ఆదేశించారు.
“నేను అలా చేసి ఉండకూడదు. ఫ్యూచర్‌లో రిపీట్ చేయను. మీరు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను,” అంటూ పవన్ క్షమాపణలు చెప్పాడు.
“ఇది నీకు లైఫ్ లెసన్ పవన్!” అంటూ, హౌస్ మొత్తం నిన్ను సపోర్ట్ చేసింది, నీ క్యారెక్టర్‌కి సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే, అవతలి వాళ్ల క్యారెక్టర్‌పై నింద పడినప్పుడు నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాలని చెప్పి, నాగార్జున ఎపిసోడ్‌ను ముగించారు.



