Bihar Poll: బిహార్ ఒపీనియన్ పోల్స్.. గెలిచేది ఎవరంటే ?
Bihar Poll: బిహార్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవ్వాలని భావిస్తున్న ఎన్నికల వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పార్టీకి.. 6-7 శాతం ఓట్లు రానున్నట్టు తెలిపింది.
Bihar Poll
ప్రస్తుతం రాజకీయ పార్టీల హడావుడి అంతా బిహార్ లోనే ఉంది. మరో 9 రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పటిలానే అధికారం కోసం ప్రస్తుత ప్రభుత్వం నితీశ్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్, తేజస్వి యాదవ్ కూటమి బరిలో ఉన్నాయి. అదే సమయంలో రాజకీయ వ్యూహకర్తగా సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద త్రిముఖ పోరు నెలకొనడంతో అందరిలోనూ ఆసక్తి బాగానే ఉంది.
ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. హామీల మీద హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఒపీనియన్ పోల్స్ (Bihar Poll)అంచనాలు వెల్లడవుతున్నాయి. తాజాగా విడుదలైన అంచనాలను చూస్తే అధికార, విపక్ష కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండబోతోందని తెలుస్తోంది. అయితే విపక్ష మహాఘట్‌బందన్ కంటే ఎన్డీఏ కూటమికి కాస్త ఎడ్డ్ ఉందని అంచనా వేస్తున్నారు.

టైకానీ అన్ని ఒపీనియన్ పోల్స్ (Bihar Poll)అంచనాల్లో కామన్ పాయింట్ ఓట్ల శాతంగా చెప్పాలి. ఎందుకంటే రెండు కూటములకు మధ్య ఓట్ల శాతం తేడా చాలా తక్కువగా ఉందని అర్థమవుతోంది. టైమ్స్ నౌ-జేవీసీ ఒపీనియన్ పోల్‌లో ఎన్డీఏ కూటమిదే విజయంగా ఇచ్చారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్వల్ప ఆధిక్యం దక్కుతుందని అంచనా వేసింది. అయితే ఎన్డీఏకు మహాకూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని తేల్చేసింది.
బీజేపీ, జేడీయూలతో కూసిన ఎన్డీఏ కూటమి.. 120-140 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ లమహాఘట్‌బంధన్ కూటమి 93-112 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. ఎన్డీఏ కూటమిలో పార్టీల వారీగా వచ్చే సీట్లను చూస్తే బీజేపీకి 70 నుంచి 81 , జేడీ(యూ):కి 42 నుంచి 48 ,ఎల్జేపీకి 5 నుంచి 7 సీట్లు, హెచ్‌ఏఎం 2 సీట్లు, ఆర్‌ఎల్‌ఎం 1 నుంచి 2 సీట్లు రానున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు మహాఘట్‌బంధన్‌లో పార్టీల వారీగా వచ్చే సీట్లను గమనిస్తే ఆర్జేడీకి 69 నుంచి 78 , కాంగ్రెస్ కు 9 నుంచి 17, వామపక్షాలకు 14 నుంచి17 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇదిలా ఉంటే ఓటింగ్ శాతం విషయంలోనూ రెండు కూటముల మధ్య తేడా చాలా తక్కువగానే ఉండబోతోంది. ఎన్డీఏ కూటమికి 41-43 శాతం మహాఘట్‌బంధన్‌కు 39- 41 శాతం ఓటు శాతం వస్తుందని అంచనా.
ఇక బిహార్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవ్వాలని భావిస్తున్న ఎన్నికల వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పార్టీకి.. 6-7 శాతం ఓట్లు రానున్నట్టు తెలిపింది. ఎంఐఎం, బీఎస్పీ వంటి ఇతర పార్టీలు 11 శాతం వరకూ ఓట్లు సాధిస్తాయని అంచనా వేసింది.




One Comment