Bigg BossJust EntertainmentLatest News

Contestants fight:లీడర్ బోర్డులో టాప్-1 కోసం కంటెస్టెంట్స్ ఫైట్.. కళ్యాణ్ పవర్ గేమ్ VS ఇమ్మాన్యువెల్ దూకుడు!

Contestants fight: ఫైనల్‌కు ముందు హౌస్ మేట్స్‌కు వారి స్థాయిని అంచనా వేసేలా బిగ్ బాస్ 'బాక్స్ ఆఫ్ ఇంపాక్ట్' అనే ఆసక్తికరమైన టాస్క్‌ను ఇచ్చారు.

Contestants fight

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకోవడంతో హౌస్‌లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. టైటిల్ రేస్ కోసం కళ్యాణ్ , తనుజ మధ్య తీవ్ర పోటీ(Contestants fight) కొనసాగుతుండగా, ఇమ్మాన్యువెల్ , సంజన కూడా స్ట్రాంగ్ కంటెండర్స్‌గా నిరూపించుకుంటున్నారు. ఫైనల్‌కు చేరుకునేందుకు హౌస్ మేట్స్ మధ్య ఫ్రెండ్సిఫ్స్ పక్కన పెట్టి, ఎవరి గేమ్ వారు ఆడుకోవడం మొదలుపెట్టారు.

క్యాప్టెన్ కళ్యాణ్ ట్విస్ట్ పవర్…ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో క్యాప్టెన్ అయిన కళ్యాణ్‌కు బిగ్ బాస్ ఒక కీలకమైన పవర్‌ను ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్‌ను సేఫ్ చేసి, మరొకరిని డేంజర్ జోన్‌లోకి తీసుకురావచ్చు. ఈ ఊహించని ట్విస్ట్ హౌస్‌లో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఈ నిర్ణయం వల్ల హౌస్ మేట్స్ మధ్య ఉన్న పాత స్నేహాలు, బంధాలు షేక్ అయ్యాయి.

ఫైనల్‌కు ముందు హౌస్ మేట్స్‌కు వారి స్థాయిని అంచనా వేసేలా బిగ్ బాస్ ‘బాక్స్ ఆఫ్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన టాస్క్‌ను ఇచ్చారు. హౌస్‌లోకి పంపిన ఆరు బాక్సుల్లో 0 నుంచి 2,50,000 వరకు వివిధ పాయింట్లు(Contestants fight) ఉన్నాయి. హౌస్ మేట్స్ చర్చించుకుని ఆ పాయింట్లను ఒక్కొక్కరికి కేటాయించుకోవాల్సి వచ్చింది.

పాయింట్ల కేటాయింపు (హౌస్ మేట్స్ నిర్ణయం):

ఇమ్మాన్యుయెల్: 2,50,000 (అత్యధికం),తనూజ: 2,00,000,డీమాన్: 1,50,000,సుమన్ శెట్టి: 1,00,000, భరణి: 50,000
సంజన: 0

Contestants fight
Contestants fight

సంజనకు ‘సున్నా’ పాయింట్లను కేటాయించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఆటతీరు బాగా ఉన్నా, తనకు దక్కింది జీరో అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇమ్మాన్యుయెల్ , డీమన్ ఆమెకు మద్దతు తెలిపినా, మెజారిటీ హౌస్ మేట్స్ మాత్రం ఆమెకు సున్నా ఇవ్వాలనే నిర్ణయాన్ని సమర్థించారు. ఈ (Contestants fight)జీరో మార్క్ కారణంగా బిగ్ బాస్ ఆమెను నేరుగా జైలుకు పంపించి, తొలి ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయేలా శిక్ష విధించారు.

సంజన జైలుకు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మెంబర్స్‌కు ఫైనల్ గేమ్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు: “ఇప్పటి నుంచి మీ అందరి భవిష్యత్తు ప్రేక్షకులకు అప్పగిస్తున్నాం. మీ ప్రదర్శనను బట్టే మీ స్కోర్ బోర్డు లెవెల్ పెరుగుతుంది. దీని ద్వారా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పారు

టాప్-1 సేఫ్టీ.. ఈ వారం లీడర్ బోర్డులో టాప్-1 స్థానంలో నిలిచిన హౌస్ మేట్ నామినేషన్స్ నుంచి పూర్తిగా సేవ్ అవుతారు.

Contestants fight
Contestants fight

టాప్-2 ఓట్ అపీల్.. టాప్-2లో నిలిచే ఇద్దరు సభ్యులు ప్రేక్షకులకు తమను సేవ్ చేయమని ఓట్ అపీల్ చేసుకొని, వారి నిర్ణయంతో సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఎలిమినేషన్.. లీడర్ బోర్డులో చివరిగా ఉన్న హౌస్ మేట్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది.

సంజన పరిస్థితి.. జైలులో ఉన్న కారణంగా సంజన మొదటి ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది.

మొదటి యుద్ధం ‘స్వింగ్ జరా’ టాస్క్.. ఈ యుద్ధంలో మొదటి టాస్క్ ‘స్వింగ్ జరా’ ఇచ్చారు. దీనికి కళ్యాణ్ సంచాలక్‌గా వ్యవహరించారు. ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయెల్ తన అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టి మొదటి స్థానంలో నిలిచాడు. తాజా లీడర్ బోర్డులో ఇమ్మాన్యుయెల్ అగ్రస్థానంలో నిలవగా, చివరి స్థానంలో సుమన్ శెట్టి ఉన్నారు. మిగిలిన సభ్యులు భరణి, డీమాన్, తనుజ మధ్య స్థానాల్లో నిలిచారు. ఫైనల్ రేస్ వేడెక్కుతున్న ఈ తరుణంలో, స్కోర్ బోర్డ్ గేమ్ ఏ మలుపు తిరుగుతుందో, ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button