Bigg Boss: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కంటెస్టెంట్ల అసలు రంగులు..బయటకు వెళ్లేదెవరు?
Bigg Boss:ఎప్పుడూ కూల్‌గా ఉండే శ్రీముఖి ఒక కామనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ ఎపిసోడ్‌లో హైలైట్ అయింది.

Bigg Boss
బిగ్ బాస్ హౌస్(Bigg Boss) లో మంగళవారం ఎపిసోడ్ ‘అగ్నిపరీక్ష’ పేరుకు తగ్గట్టుగానే చాలా వేడిగా సాగింది. ముగ్గురు జడ్జిలు, యాంకర్ శ్రీముఖి కంటెస్టెంట్లకు అద్దం చూపిస్తూ వారి అసలు స్వభావాలను బయటపెట్టారు. ముఖ్యంగా, ఎప్పుడూ కూల్‌గా ఉండే శ్రీముఖి ఒక కామనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ ఎపిసోడ్‌లో హైలైట్.
కంటెస్టెంట్లు ముక్కుసూటిగా, నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో వివరిస్తూ, రెండు ఎల్లో కార్డులు పొందినవారు బయటకు వెళ్తారని బిగ్ బాస్(Bigg Boss) టీమ్ స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా, కంటెస్టెంట్లను స్టేజ్‌పైకి పిలిచి, మరొకరికి ఏ ట్యాగ్ సరిపోతుందో చెప్పమన్నారు. ఇది ఒకరి అభిప్రాయం మరొకరిపై ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించింది.
శ్రేయ, శ్రీజకు ‘క్లెవర్’ అని పాజిటివ్ ట్యాగ్ ఇచ్చింది.దివ్య, మనీష్‌కు ‘ఓవర్ స్మార్ట్’ అని ట్యాగ్ ఇచ్చి, అతను మిగతా వారికంటే తానే గొప్పని అనుకుంటాడని చెప్పింది. మిగతా కంటెస్టెంట్లు కూడా దీనిని సమర్థించారు.
ప్రియా, షాకిబ్‌కి ‘బోరింగ్’ అని చెప్పినా, షాకిబ్ దాన్ని అంగీకరించలేదు. హరీష్, శ్వేతకు ‘హిప్పోక్రసీ’ ట్యాగ్ ఇచ్చి, ఆమె చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదని ఆరోపించాడు.
ఈ టాగ్ గేమ్‌లో కొందరు కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను సరిగ్గా చెప్పలేకపోయారు. ముఖ్యంగా ప్రసన్న, నాగకు ‘డంబ్’ అని, హరీష్‌కు ‘ఇగోయిస్ట్’ అని ట్యాగ్ ఇచ్చినా, దానికి సరైన కారణాలను వివరించలేకపోయాడు. దీంతో శ్రీముఖి, జడ్జ్‌లు అతనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “కనీసం మీ అభిప్రాయాన్ని కూడా మీరు గట్టిగా చెప్పలేకపోతే ఎలా?” అని ప్రసన్నను నిలదీశారు.

ఆ తర్వాత నిర్వహించిన ‘తోలుబొమ్మలాట’ టాస్క్‌లో, షాకిబ్ నిబంధనలను అతిక్రమించాడు. టాస్క్ మధ్యలో మళ్లీ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది చూసి ఎప్పుడూ కూల్‌గా ఉండే శ్రీముఖి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయింది. “నీకు రూల్స్ తెలియవా?” అంటూ షాకిబ్‌పై ఫైర్ అయ్యింది. ఈ చర్యకు అతన్ని ఆట నుంచి తొలగించారు. చివరికి, ఈ ఎపిసోడ్‌లో ఇద్దరు కామనర్లు ఎల్లో కార్డులు పొందారు – ప్రసన్న ,షాకిబ్. ఇప్పటికే ఎల్లో కార్డులు పొందినవారికి ఇది ఒక హెచ్చరికలాంటిది.
కంటెస్టెంట్లందరూ కలిసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నాగ్‌ని ఎంచుకున్నారు. దీంతో అతనికి మరోసారి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభించింది. ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య ఉన్న నిజమైన అభిప్రాయాలు, వారి బలహీనతలు, ఒకరిపై ఒకరికి ఉన్న అంచనాలు బయటపడ్డాయి. రాబోయే రోజుల్లో ఈ ఎల్లో కార్డులు ఎవరిని ఇంటి నుంచి పంపిస్తాయో చూడాలి.
One Comment