Just TelanganaLatest News

Rain: వర్షం పడిందా ..మీ రోడ్డు మాయం అయిపోతుంది జాగ్రత్త

Rain: కళ్ల ముందు నేల కుంగిపోయింది..బంజారాహిల్స్‌ రోడ్డులో భయానిక స్థితి

Rain

వర్షాలు (Rain) మొదలయ్యాయి అంటే హైదరాబాద్ వాసులకు ఇక ఆందోళనలే. ఒక్కసారి మబ్బు కమ్మితే చాలు.. నాలాలు పొంగి రోడ్లే చెరువులను తలపిస్తాయి. దీంతో ఎక్కడ గుంత ఉందో , ఎక్కడ మ్యాన్ హోల్ నోరు తెరుచుకుని చూస్తుందోనని జనాలు వణికిపోతూ ఉంటారు. దీనికి తోడు ఎక్కడ రోడ్డు కుంగుతుందో, ఎక్కడ ప్రమాదం ఎదురవుతుందో అన్న భయంతో జీవించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతోంది.

తాజాగా బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబర్ 1లో ఏకంగా రహదారి మింగేంత ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షం తరువాత రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అదే సమయంలో అక్కడి దాకా వచ్చిన నీటి ట్యాంకర్‌ నేరుగా ఆ గుంతలో పడిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనం బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

Rain
Rain

ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కుంగిన రహదారి కింద నాలా పైప్‌లైన్ ఉందని, దానివల్లే మట్టి కదిలి రోడ్ కుంగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే గతంలో ఇది గుర్తించలేదా? ఇటువంటి ప్రమాదాలను ముందే అంచనా వేయలేరా? ఇప్పుడు కళ్లకు కనిపిస్తున్న ప్రశ్నలు..జీహెచ్ఎంసీ (GHMC) రోడ్లను ఎలా నిర్మిస్తోంది?..ఈ ప్రమాదానికి వాతావరణమే కారణమా లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఈ సిటీలో ప్రజల భద్రతకి విలువ ఉందా?రోడ్డలు ఎక్కడైనా కుంగిపోయే ప్రమాదం ఉందా? మరి వీటికి సమాధానం దొరుకుతుందో లేదో చూడాలి.

దీంతో జనాల్లో కూడా అవేర్ నెస్ రావాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. భారీ వర్షాల్లో ముఖ్యమైన ట్రాఫిక్ రూట్లపై ప్రయాణించేముందు ట్రాఫిక్ పోలీస్ అప్‌డేట్స్‌ను ఫాలో అవ్వాలి.వర్షం పడే సమయంలో మానిటర్ చేయని జాగ్రత్తలే ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అందుకే నీటి ప్రవాహం ఉన్న రోడ్లపై మోటారు వాహనాలు నడపకుండా, ముందే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. జీహెచ్‌ఎంసీ యాప్, సోషల్ మీడియా అప్డేట్స్‌ను ఉపయోగించుకుంటూ ప్రమాదస్థల చుట్టూ తిరగకుండా ఉండాలి.

కుంగే ప్రమాదం ఉన్న రోడ్లను అధికారులు ముందుగానే గుర్తించి, అవసరమైన బలపడే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.. .డ్రైనేజీ పైప్‌లైన్‌లు, నాలాల పరిస్థితిని వర్షాకాలం (Rain) ముందు సమీక్షించి మరమ్మతులు చేయాలని అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా.. జరగకముందే స్పందించే అలవాటు పాలకుల్లో రావాలని కోరుతున్నారు.

Also Read: Local identity: రెండేళ్లు బయట చదివితే స్థానికత పోతుందా?

 

Related Articles

Back to top button