Just EntertainmentLatest News

Janhvi Kapoor:పెద్దిలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!

Janhvi Kapoor: దఢక్' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ జాన్వీ కపూర్, ఇప్పుడు వరుస తెలుగు ప్రాజెక్టులతో ఇక్కడ ఆడియన్స్‌కు చేరువవుతోంది.

Janhvi Kapoor

బాలీవుడ్ అందాల తార, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ప్రస్తుతం సౌత్ సినిమాలపై, ముఖ్యంగా తెలుగు చిత్రాలపై దృష్టి సారించారు. ‘దఢక్’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు వరుస తెలుగు ప్రాజెక్టులతో తెలుగు ఆడియన్స్‌కు చేరువవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో గ్రామీణ యువతి అయిన తంగం పాత్రలో నటించి మెప్పించింది. ‘దేవర’ తర్వాత ఆమె నటిస్తున్న రెండో తెలుగు సినిమా ‘పెద్ది’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

‘పెద్ది’ చిత్రం నుంచి ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండానే, జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనుంది.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో జాన్వీ కపూర్(Janhvi Kapoor) మైక్ సెట్టింగ్ నిర్వహించే పాత్రలో కనిపిస్తున్నారు. పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా సాంప్రదాయ దుస్తుల్లో, నేచురల్ లుక్‌లో జాన్వీ మరింత అందంగా ఆకట్టుకుంటున్నారు. ‘దేవర’లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన జాన్వీ, ‘పెద్ది’ చిత్రంలోనూ దాదాపు అలాంటి పాత్రలోనే నటిస్తుండడం విశేషం. ఈ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు దివ్యేందు (మీర్జాపూర్ ఫేమ్), అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పెద్ది చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ‌తో పాటు గ్లింప్స్ కూడా భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారనే టాక్ కూడా నడుస్తోంది.

Prashant Kishor: వచ్చే 150 లేకుంటే 10..  పీకే కామెంట్స్ వైరల్

Related Articles

Back to top button