Just EntertainmentLatest News

Mahavatar Narasimha: మహావతార్ నరసింహ.. ఆస్కార్ బరిలో భారత యానిమేషన్ సత్తా

Mahavatar Narasimha: 'మహావతార్ నరసింహా'కు ఆస్కార్ అవార్డు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే, కేవలం ఎంపిక కావడం అనేది భారతీయ చలన చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా యానిమేషన్ రంగంలో ఒక హాట్ టాపిక్‌గా మారింది.

Mahavatar Narasimha

మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంతో దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narsimha) తాజాగా 98వ ఆస్కార్ అవార్డుల బరిలోకి నిలవడం భారతీయ సినీ పరిశ్రమకే గర్వకారణం.

ఇది యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ ప్రవేశం దక్కించుకుంది. ఈ కేటగిరీలో పాప్ డీమన్ హంటర్స్, ఇన్ఫినిటీ కాస్టెల్, డీమన్ స్లేయర్… కిమెట్సు నో యైబా వంటి భారీ హాలీవుడ్, అంతర్జాతీయ సినిమాలు పోటీలో ఉండటం ఈ భారతీయ చిత్రానికి దక్కిన గౌరవాన్ని మరింత పెంచుతోంది.

‘మహావతార్ నరసింహా(Mahavatar Narasimha)’ కేవలం ఆస్కార్ ఎంట్రీతోనే కాదు, దాని బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌తో కూడా సంచలనం సృష్టించింది. కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ మూవీ లాంగ్ రన్‌లో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

ఈ అద్భుతమైన విజయం భారతీయ ప్రేక్షకుల్లో పౌరాణిక కథాంశాలు, అద్భుతమైన విజువల్స్ ఉన్న యానిమేషన్ సినిమాలను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని రుజువు చేసింది.

ఈ(Mahavatar Narasimha) చిత్రంలో నరసింహుని ఉగ్రరూపాన్ని, ప్రహ్లాదుని భక్తిని తెరపై ఆవిష్కరించిన తీరు ఆడియన్స్‌ను ఫిదా చేసింది. సాంప్రదాయ పౌరాణిక అంశాలకు ఆధునిక యానిమేషన్ టెక్నాలజీని జోడించడంతో విజువల్ ఎలివేషన్ విజయానికి కీలకంగా నిలిచింది.

Mahavatar Narasimha
Mahavatar Narasimha

ప్రతి ఎలివేషన్‌కు తగ్గట్టుగా వచ్చిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రాణంగా నిలిచి, ప్రేక్షకుల్లో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.

హాలీవుడ్ మరియు జపనీస్ యానిమేషన్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ సమయంలో, భారతీయ యానిమేషన్ సినిమా ప్రపంచ స్థాయిలో దృష్టిని ఆకర్షించడం ఒక మైలురాయి. ఇది భారత యానిమేటర్లు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు.

ఆస్కార్ బరిలో నిలవడం అనేది, ఇకముందు భారతదేశంలో యానిమేటెడ్ సినిమాలను తీయడానికి నిర్మాతలు, పెట్టుబడిదారులు ముందుకు రావడానికి ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తే భారీ కలెక్షన్లు సాధించవచ్చనే విశ్వాసాన్ని పెంచుతుంది.

హిందూ పౌరాణిక కథాంశాలు ప్రపంచ వేదికపైకి చేరుకోవడానికి ఈ సినిమా ఒక బలమైన వేదికను ఏర్పాటు చేసింది. భారతీయ సంస్కృతి, కథా సంపదకు గ్లోబల్ ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తుందని నిరూపించింది.

‘మహావతార్ నరసింహా’కు ఆస్కార్ అవార్డు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే, కేవలం ఎంపిక కావడం అనేది భారతీయ చలన చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా యానిమేషన్ రంగంలో ఒక హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఘనతతో స్ఫూర్తి పొంది భవిష్యత్తులో మన దేశం నుంచి అనేక అత్యాధునిక యానిమేటెడ్ సినిమాలు రావడానికి ఈ సినిమా తలుపులు తెరిచిందని చెప్పొచ్చు. ఈ విజయం యానిమేషన్ రంగానికి కొత్త ఆశాకిరణం లాంటిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button